AIST నోటిఫికేషన్‌ను విడుదల
రాబోయే కాలంలో చక్కని ఫ్యూచర్ ఉన్న కోర్సుల్లో ఫుట్‌వేర్ డిజైన్ కూడా ఒకటి. ఫ్యాషన్ రంగంలోనే కాదు మామూలు బిజినెస్‌గా కూడా షూ, ఫుట్‌వేర్ డిజైన్ మంచి డిమాండ్ ఉన్న ప్లాట్ఫార్మ్. ఈ కోర్స్ చేయటానికి ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ మంచి అవకాశం కల్పిస్తోంది.

(FDDI) ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ 2022–23 విద్యాసంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘ ఆల్ ఇండియా సెలెక్షన్ టెస్ట్’ (ఆఈశ్ట్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా బ్యాచ్‌లర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు.. ఎఫ్‌డీడీఐ క్యాంపస్‌లు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్‌తో పాటు నోయిడా, పుర్సత్, చంఢీగడ్, అంకలేశ్వర్, గుణ, చెన్నై, పట్నా, కోల్‌కతా, రోహ్తక్, చింద్వారా, జోధ్‌పూర్ నగరాల్లో ఉన్నాయి. ప్రతి క్యాంపస్‌లో 60 సీట్లు ఉంటాయి.
ఇంటర్ అయిపోయిన విద్యార్తులకు డిగ్రీ ప్రోగ్రామ్ లో భాగంగా బ్యాచ్‌లర్ ఆఫ్ డిజైన్‌లో ఫుట్‌వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్, లెదర్ గూడ్స్ అండ్ అక్సెసరీస్, ఫ్యాషన్ డిజైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో ‘రిటైల్ అండ్ మర్చండైజ్’ కోర్సు అందుబాటులో ఉంది. బ్యాచ్‌లర్ డిగ్రీలో చేరేందుకు ఏదేని గ్రూపులో ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే అబ్యర్తుల వయసు వయసు 25 ఏళ్లకు మించకుండా ఉండాలి.
ఫుట్‌వేర్ డిజైన్‌లో డిగ్రీ పూర్తయిన వాళ్లకి మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్‌లో భాగంగా మాస్టర్ ఆఫ్ డిజైన్‌లో ఫుట్‌వేర్ డిజైన్ కోర్సు… నోయిడా, చెన్నై క్యాంపస్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. మొత్తం 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటిదే మరో కోర్సు ‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్’ నోయిడా, పట్నా, హైదరాబాద్, చంఢీగడ్ క్యాంపస్‌లలో అందుబాటులో ఉంది. ప్రతి క్యాంపస్‌లో 60 సీట్లు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఈ కోర్స్ అప్లై చేయాలనుకుంటే ఎలాంటి వయోపరిమితి లేదు. ఏఐఎస్టి స్కోర్ మీద ఆధారపడి సీట్ల కేటాయింపు ఉంటుంది. పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. 2022 ఏప్రిల్ 28 లోపు ఆసక్తి గల అభ్యర్తులు అప్లై చేసుకోవచ్చు. ఎంట్రెన్స్ పరీక్ష జూన్ 19న నిర్వహిస్తారు.