హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు: త్వరగా అప్లై చేయండి
హైదరాబాద్ నేషన్ పోలీస్ అకాడమీ(SVPNPA)లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ ఆఫీసర్, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగాలతో పాటు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలపై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులు దరఖాస్తులను మార్చి 14వ తేదీలోగా The Assistant Director(Esst.I), SVP Natinol Police Academy, Shivarampalli, hyderabad-500052, Telangana. చిరునామాకు పంపించాలి.
వెటర్నరీ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. దీనికి గానూ వెటర్నరీ సైన్స్, అనిమల్ హస్బండరీ డిగ్రీ ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేసిన వారు అర్హులు. నెలకు రూ.98 వేల వేతనం ఉంటుంది.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా మాస్టర్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. సంభందిత పనిలో అనుభవం ఉంటే ప్రాధాన్యత పెరుగుతుంది. నెలకు రూ.98 వేల వేతనం ఉంటుంది.
జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారు అర్హులు. వీరికి నెలకు రూ.75,658 వేతనం ఉంటుంది.
ఇవి కాకుండా… ఎక్స్-రే టెక్నీషియన్ విభాగంలో 1 ఖాళీ ఇంటర్, రేడియాలజీలో డిప్లొమా ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. వేతనం రూ.45,186 ఉంటుంది.
ఫిజియోథెరపిస్ట్ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. ఫిజియోథెరపీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.60,828 వేతనం ఉంటుంది.
స్టాఫ్ నర్స్ విభాగంలో 1 ఖాళీ ఉంది. బీఎస్సీ నర్సింగ్, జనరల్ నర్సింగ్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. నెలకు రూ.75,838 వేతనం చెల్లించనున్నారు.
జూనియర్ ప్రొజెక్షనిస్ట్ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ చేసి ఉంటే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.33 వేలు.
కెమెరామెన్ విభాగంలో 3 ఖాళీలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ/సినిమాటోగ్రఫిలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.51,032 వేతనం ఉంటుంది.
డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో 6 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసై, కంప్యూటర్ నైపుణ్యం ఉన్న వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.45,186 వేతనం ఉంటుంది.
స్పోర్ట్స్ కోచ్ విభాగంలో 1 ఖాళీ ఉంది. అభ్యర్థులు శాఈలో కోచింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఇంగ్లిష్, హిందీలో సంభాషణ నైపుణ్యం ఉండాలి. వేతనం రూ.42 వేలు.