డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులదే రాబోయే కాలం
మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా. ప్రతీ సంవత్సరం కొత్త కొత్త కోర్సులు వస్తూనే ఉన్నాయి. అయితే ఈ కోర్సుల్లో ఏది భవిశ్యత్తులో పనికి వస్తుందో అర్థం కాని స్థితిలో స్టూడెంట్స్ పడిపోతున్నారు. నిజానికి గ్రాడ్యుయేషన్ స్థాయిలోనే ఒక కచ్చితమైన నిర్ణయం తీసుకోకపోతే తరవాత కెరీర్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. సాంకేతికతల రూపకల్పన, తయారీ, పర్యవేక్షణ మరియు నిర్వహణలో ఉపాధి రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. రానున్న రోజుల్లో మంచి డిమాండ్ ఉండే కోర్సులు, డిగ్రీల వివరాలు తెలుసుకోవటం చాలా అవసరం…

Pharmacology
ఫార్మకాలజీ కోర్సు చేసిన వారు ఫార్మసిస్ట్, ఫర్మకాలజిస్ట్, మెడికల్ రైటర్, ఫార్మాస్యూటికల్ సేల్స్ రిప్రజెంటేటీవ్ లాంటి రంగాల్లో అవకాశాలు ఉంటాయి. pharmacology అంటే డ్రగ్స్, మనుషులు ఇతర జీవులమీద అవి ఎలా పని చేస్తాయో అధ్యనం చేసే కోర్స్, ఈ సమయంలో ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో ఈ కోర్స్ చేసిన వారికి మంచి డిమాండ్ ఉంటుంది.

Data Science
ఈ టెక్నాలజీ యుగంలో ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు డాటా సైన్స్‌లో మంచి అవకాశాలు ఉందబోతున్నాయి. 2026 కల్లా ఈ రంగంలో 27.9 శాతం ఉద్యోగావకాశాలు ఉన్నాయి. కంప్యూటర్స్, మాథ్స్, అనలైటిక్స్ లాంటి సబ్జెక్ట్‌ల మీద ఇంట్రస్ట్ ఉన్నవాళ్లకి ఇది మంచి కోర్స్.

Cyber security
సైబర్ సెక్యూరిటీకి ఇప్పుడు ఉన్న డిమాండ్ చాలా ఎక్కువే. దాదాపుగా ప్రతీ టెక్ సంస్థలోనూ సైబర్ సెక్యూరిటీకి అత్యంత ప్రాధాన్యం ఉంది. సైబర్ సెక్యూరిటీ కోర్సు చేసిన వాళ్లకి త్వరలో మంచి అవకాశాలు ఉండబోతున్నాయి.

Construction Management
కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ కు సంబంధించిన కోర్సులు చేసిన వారికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఈ కోర్సులు చేసిన వారు కన్స్ట్రక్టర్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఎస్టిమేటర్, కన్స్ట్రక్టర్ ఇన్స్పెక్టర్, సివిల్ ఇంజనీర్‌గా మంచి అవకాశాలు అందుకోవచ్చు. నిర్మాణ రంగం ఏ కాలంలో అయినా మంచి డిమాండ్ ఉన్న రంగం.

Game Design Courses
రోజుకో కొత్త గేమ్ మార్కెట్‌ని ముంచెత్తే రోజులు ఇవి. ఒక్క గేమ్ క్లిక్ అయినా ఊహించని స్థాయిలో కెరీర్ మలుపు తిరిగి పోవచ్చు. గేమ్ డిజైనింగ్ కోర్సులకు సంబంధించిన డిగ్రీ చేసిన వారికి ఫ్యూచర్ రెడ్ కార్పెట్‌తో స్వాగతం చెబుతుంది. బుర్రలో క్రియేటివిటీ, కాస్త కష్టపడే గుణం ఉంటే ఈ రంగంలో ఎదురు లేనట్టే.
Read this