బట్టలతో క్యారెక్టర్ డిసైడ్ చేస్తారా?
టాలీవుడ్ లో సురేఖ వాణి పేరు తెలియని వారుండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో పాత్రలను పోషించిన నటిగా మనకు సురేఖవాణి సుపరిచితమే. సోషల్ మీడియా వేదికగా తన కూతురు సుప్రీతో కలిసి ఈమె చేసే హంగామా గురించి అందరికీ తెలిసిందే. మోడరన్ డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేస్తూ ఆ డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కొన్ని సార్లు దారుణమైన కామెంట్లను, ట్రోలింగ్ ను కూడా ఎదుర్కోవలసి వస్తోంది.

వారి వీడియోలను ఆదరించే వాళ్ళు కూడా చాలామందే ఉందటం వల్ల ట్రోలింగ్స్ ని పట్టించుకోకుండా వీడియోలు పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే సహనం ఎన్నో రోజులు ఉందదుగా. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేఖ వాణి కూతురు సుప్రీత తమ గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక ఇంటర్వ్యూలో సుప్రీత మాట్లాడుతూ… మా నాన్న చనిపోయిన తరువాత ఆ బాధను మేము ఎంత భరించామో మాకు మాత్రమే తెలుసు. మా కుటుంబానికి వెనుక ముందు ఎవరూ లేరు. అమ్మని ఓదార్చడానికి కూడా ఎవరూ లేరు ఆ సమయంలో అమ్మ ఎంత బాధ పడిందో నాకు మాత్రమే తెలుసు. అంటూ బాధ పడ్డారు.

అమ్మ ఒంటరిగా బాధపడుతూ ఉన్న సమయంలో బలవంతంగా బయటకు వెళ్దామని పార్టీకి తీసుకు వెళ్ళాను.ఆ ఫోటోలు నా స్టోరీ లో పెట్టుకుంటే చాలా మంది ఆ ఫోటోలకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు కొంచమైనా బాధ ఉందా? భర్త చనిపోగానే ఇలా బయట తిరగడం ఏంటి? అంటూ కామెంట్ చేశారు.పైకి మేము నవ్వుతూ ఉంటే లోపల బాధ లేనట్టేనా నోటికి ఎంత వస్తే అలా అనేస్తారా అంటూ విరుచుకు పడింది. పొట్టి దుస్తులు వేస్తే తప్పేంటి? మా దుస్తులకు మీరు డబ్బులు కడుతున్నారా… పొట్టి దుస్తులు వేసుకొని తిరిగితే క్యారెక్టర్ లేనట్టా? అంటూ తమ గురించి నెగిటివ్ కామెంట్లు చేసే వారికి సమాధానం ఇచ్చారు.