మా ఊరి వాళ్లంతా హోమో సెక్సువల్స్ : ద కశ్మీర్ ఫైల్స్ దర్శకుడి వ్యాఖ్యలపై వివాదం
ద కశ్మీర్ ఫైల్స్ సినిమాతో దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. ఓ వివాదంలో చిక్కుకున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ప్రజలు హోమో సెక్సువల్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భోపాలీలు స్వలింగ సంపర్కులుగా భావించబడుతున్నారని. అందుకు బోధపాల్ నవాబీ నగరం కావడం. వాళ్ల కోరికలే కారణం అయి ఉండొచ్చు.. అని వివేక్ అగ్నిహోత్రి అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను భోపాల్‌కు చెందిన వాడిని. కానీ, ఎక్కడా ఈ విషయాన్ని చెప్పను. ఎందుకంటే భోపాలీలు అంతా హోమో సెక్సువల్స్లా వ్యవహరిస్తుంటారు. వారు నవాబుల ప్రవర్తన కలిగి ఉంటారు’ అని వివేక్ అగ్నిహోత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వీడియో వైరల్ కావడంతో ఆయనపై పలువురు రాజకీయ నేతలు సహా భోపాలీలు, నెటిజన్లు మండిపడుతున్నారు.

ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు శుక్రవారం భోపాల్ పర్యటనకు వచ్చే ముందు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. అగ్నిహోత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “వివేక్ అగ్నిహోత్రి జీ, మీకు,వ్యక్తిగతంగా అలాంటి అనుభవం ఉందేమో. కానీ, భోపాల్ ప్రజలెవరికీ లేదు. నేను 1977 నుండి భోపాల్ నగరంతో, భోపాలీలతో నాకు అనుబంధం ఉంది. కానీ, నాకు మీ లాంటి అనుభవం లేదు ” అని సింగ్ ట్వీట్ చేశాడు.
వివేక్ అగ్నిహోత్రి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి శుక్రవారం (మార్చి 25) న పాల్గొన్న ఓ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు వివేక్ అగ్నిహోత్రి అనుచిత వ్యాఖ్యలపై ఆయన్ను ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే వివేక్ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇదే విషయంపై బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాష్ విజయ వర్గియాను ప్రశ్నించగా. ఆ విషయం ఆయన్నే అడగండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.