భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్
సినిమా పరిశ్రమలో విడాకుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో స్టార్ డైరెక్టర్ భార్యతో లీగల్గా విడిపోయినట్లు ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు బాలా తన భార్య మధుమలార్కు డివోర్స్ ఇచ్చాడు.
దాదాపు 18 ఏళ్ల పాటు సాగిన వీరి వివాహ బంధానికి నేటితో తెరపడింది. తెలుగులో సమంత, చైతు.. కొన్ని రోజుల క్రితం ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్ విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా బాల, మధుమలర్ డివోర్స్ తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.గత నాలుగేళ్లుగా బాల, మధుమలర్ విడి విడిగా ఉంటున్నారు. మ్యూచువల్ విడాకులకు అప్లై చేసిన ఈ జంటకు తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. వీరికి ఒక కూతురు ఉంది. ఇక దర్శకుడిగా బాల.. తమిళ్లోనే కాకుండా తెలుగులోనూ సుపరిచితుడు.
బాల తెరకెక్కించే చిత్రాలు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటాయి. సూర్య, విక్రమ్ కలసి నటించిన శివ పుత్రుడు (పితామగన్) చిత్రం సంచలనం సృష్టించింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. అలాగే 2008లో బాల ‘నాన్ కడవుల్’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉండగా బాల తదుపరి చిత్రం హీరో సూర్యతో ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.