ఎన్టీఆర్ క్యారికేచర్ వేస్తే లక్ష రూపాయలు
బంపర్ ఆఫర్ ప్రకటించిన కలయిక ఫౌండేషన్
బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ, సీనియర్ పాత్రికేయులు ఎస్.వెంకట నారాయణ (ఢిల్లీ), డాక్టర్ మహ్మద్ రఫీ, కార్టూనిస్ట్ కళ్యాణం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్బంగా వారి వ్యక్తిత్వంపై అంతర్జాతీయ స్థాయిలో కవిత్వం, క్యారికేచర్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తెలిపారు.
క్యారికేచర్ పోటీల్లో మునెన్నడు లేని విధంగా ప్రధమ బహుమతి లక్ష రూపాయలుగా ప్రకటించారు.
ద్వితీయ బహుమతి 75 వేలు,
తృతీయ బహుమతి గా 50 వేలు,
మరో ఐదుగురికి ఒక్కొక్కరికి పది వేల రూపాయల వంతున ప్రత్యేక బహుమతులు
ఎన్టీఆర్ వ్యక్తిత్వంపై కవిత్వ పోటీల్లో
ప్రథమ బహుమతి 25 వేల రూపాయలు,
ద్వితీయ 20 వేలు,
తృతీయ 15 వేల రూపాయలు,
మరో ఐదుగురికి ఐదు వేల రూపాయలు, ప్రశంసా పత్రాలు అందించనున్నారు.
ఇవ్వనున్నట్లు కలయిక ఫౌండేషన్ చైర్మన్ చేరాల నారాయణ తెలిపారు.

ఈ పోటిలో వచ్చిన ఉత్తమ క్యారికేచర్లు, కవిత్వంతో ఎన్టీఆర్ శత జయంతి సంకలనాలు వేసి వివిధ దేశాల్లో ఆవిష్కరించనున్నట్లు చేరాల నారాయణ తెలిపారు.
క్యారికేచర్లు కవితలు పంపించేందుకు ఆఖరి తేదీ ఏప్రిల్ 21. ఫలితాలను ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 28న హైదరాబాద్ లో ప్రకటిస్తారు.
Mail.ID – ntrcaripoem@gmail.com
WhatsApp – 9346273799, 9395355566
ఎన్టీఆర్ అభిమానులకు కళాకారులకు అయన గురించి ప్రపంచానికి చెప్పడానికి ఇదో గొప్ప అవకాశం.