అర్థసత్యాల, విద్వేషపు సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’…!
కశ్మీర్ ఫైల్స్ సినిమా వివ్బాదం ఇంకా రగులుతూనే ఉంది. సాక్షాత్తూ దేశ ప్రధాని సహా పెద్ద పెద్ద నేతలూ, మంత్రులూ ఈ సినిమాకి అనుక్లూలంగా, వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ సినిమాలో ఎక్కువగా అబద్దాలే చూపించారనే మాట గట్టిగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సినిమా విషయమై ఓ చిన్నపాటి వార్ జరుగుతోంది. కశ్మీర్ ఫై;ల్స్ సినిమాలో చూపించిన అంశాలని ఖండిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ డేవిడ్ రాసిన వ్యాసమిది.
“బండెడు అబద్ధం కంటే చిటికెడు సత్యం కలిసిన అబద్ధం ఎక్కువ ప్రమాదకరం” అంటాడు దోస్తవిస్కీ. ఈ మాటలు ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు సరిగ్గా సరిపోతాయి.
90వ దశకంలో కశ్మీర్ పండితులను పాకిస్తాన్ ప్రేరేపిత వేర్పాటువాదులు ఊచకోత కోసారని, లక్షలాది మంది ఆ ప్రాంతం విడిచి వెళ్లేలా చేశారని, మరుగున పడిన ఆ ఘాతకాన్ని తన సినిమా ద్వారా చూపించడానికి ప్రయత్నించానని చెప్పుకున్నాడు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి…!

అయితే 90ల కాలంలో జరిగిన ఘర్షణలో కేవలం పండితులు మాత్రమే చంపివేయబడ్డారా ముస్లింలు ఎవరూ చనిపోలేదా అంటే ఈ సినిమాలో సమాధానం దొరకదు. కారణం దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒక వైపు మాత్రమే చూపించాలని అనుకున్నాడు కాబట్టి. సంకుచితమైన అతని కెమెరా కళ్ళు ఒక వర్గాన్ని శత్రువులుగా చూపాలనుకున్నాయి కాబట్టి ఎక్కడా కూడా ముస్లీం బాధితులను చూపకుండా జాగ్రత పడ్డాడు.
170 నిమిషాల తన సినిమాలో అణువణువునా ముస్లీం సామాజిక వర్గాన్ని శత్రువుగానే చూపేందుకే శతవిధాల ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు. దేశాన్నేలే పాలకులు వారి అనుయాయులకు కావాల్సింది కూడా ఇదే కాబట్టి దాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ, అడగకముందే రాయితీలు ఇస్తూ, పబ్లిసిటీ కల్పిస్తూ దాని విషబీజాలు మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి ఆ ఘర్షణలో, మారణహోమంలో కేవలం పండితులు మాత్రమే చనిపోలేదు అంతకంటే ఎక్కువ సంఖ్యలో ముస్లింలు చనిపోయారు. సిక్కులు చనిపోయారు, ఇతర మైనారిటీలు చనిపోయారు. ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరించింది ఈ సినిమా. ఈ మాట అంటున్నది నేను మాత్రమే కాదు. ఆనాడు నమోదైన రికార్డ్స్ చెబుతున్నాయి. అనేక నివేదికలు చెబుతున్నాయి. ఆ ఘర్షణలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ‘పండితులు’ చెబుతున్నారు.
నేటికీ జమ్మూ లోని ‘జగ్తీ టౌన్షిప్’లో తన కుటుంబంతో నివసిస్తున్న ప్యారేలాల్ పండిత ఒక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ, ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పూర్తి కథను చూపించ లేదని కశ్మీరీ పండిట్లతో పాటు, కశ్మీర్‌లోని ముస్లిం, సిక్కు కమ్యూనిటీకి చెందిన ప్రజలు కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందని, కానీ వారి గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేదని అన్నారు.
ఆయనే కాదు మాజీ ఏయిర్ ఫోర్స్ అధికారి రవి కన్నన్ భార్య షాలిని కన్నన్ భార్య కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో తప్పుగా చూపించారని కేసుకుడా నమోదు చేసింది.
ఈ వివాదాలన్నీ ఒకటైతే సినిమాలో చూపించినట్లు ఆనాడు కేవలం కశ్మీర్ పండితులు మాత్రమే ఊచకోతకు గురయ్యారా అనేది చూడాలి. దీనికి అనేక ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. ఆ సందర్భంగా జరిగిన ఘటనలపై kashmir news network ఒక నివేదిక తయారు చేసింది. కేసు నంబర్ల ఆధారంగా వాటిని రికార్డ్ చేసింది. అందులో నమోదైన కొన్ని వివరాలు…
తమ ఉద్యమానికి సహకరించడం లేదనే కారణంతో 1990 మార్చి 4న JKLF సంస్ధకు చెందిన వ్యక్తులు ఇద్దరు ముస్లీం బాలికలను ఇంట్లో నుండి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్యచేసి చంపి వేశారు.
1990 మే 5, డాలీ మోహి ఉద్ దీన్ అనే బాలికను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, రెండు రోజులపాటు చిత్రహింసలు పెట్టి, సామూహిక అత్యాచారం చేసి, చివరకు JKLF కు చెందిన ఫరూఖ్ అహ్మద్ దార్ ఆమెకు కాల్చి చంపేశాడు.

1993 ఫిబ్రవరి 14న బారాముల్లా లోని నదిహల్ బందిపోరా ప్రాంతంలో నిఘత్ రసూల్ అనే మహిళను అత్యంత తీవ్రంగా వేధించి, ఆమె తల కొరిగి, అత్యాచారం చేసి, చంపివేశారు.
1991, జనవరి 18న బాలాముల్లా లోని హక్బ రా ప్రాంతానికి చెందిన సుల్తాన్ కూతురు జరీఫాను మిలిటెంట్ తో వివాహం జరిపించేందుకు ఒప్పుకోనందుకు ఆమెను అత్యాచారం చేసి చంపివేసి, ఆమె సోదరులిద్దరిని చిత్రహింసలు పెట్టి చంపివేశారు.

1990 జూన్ 17న శ్రీనగర్ లోని మిస్కీన్ బాగ్ ప్రాంతంలో Marooqa gudi అనే ముస్లిం బాలికను బాలికను అపహరించి, అత్యాచారం చేసి , చివరకు చిత్రహింసలకు గురిచేసి చంపేశారు.
1991మార్చి 21న శ్రీనగర్ లోని మాలిక్ సాహెబ్ ప్రాంతంలో మొఘలి అనే ముస్లిం బాలికను అపహరించి అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.
షామిమా అనే టీవీ ఆర్టీస్టుని ఆమె ఇంటి నుండి అపహరించి హత్యాచారం చేసి చంపివేశారు.

బారాముల్లా లోని పట్టన్ ప్రాంతంలో సకీనా అనే ముస్లిం అమ్మాయిని ఇంట్లోనుండి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు.
బారా ముల్లా లోని షీర్ ప్రాంతంలో గనిబషీర్ అహ్మద్ ఖాన్ ను మిలిటెంట్లు అపహరించడానికి ప్రయత్నిస్తే అతని భార్య షాకిలా జాన్ అడ్డుపడ్డందుకు ఆమెను భర్తముందే కాల్చి వేశారు.
ఇలా ఒక్కటికాదు రెండు కాదు వందల సంఘటనలో ముస్లిం మహిళలు, పురుషులు చిత్రహింసలకు, అత్యాచారానికి, హత్యకు గురయ్యారు. ఇలా చంపి వేయబడ్డవాళ్లలో కశ్మీర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ముసిర్ ఉల్ హక్ ఉన్నాడు.

కశ్మీర్ సీపీఐ నాయకుడు అబ్దుల్ సత్తార్ రాజ్నూర్ ఉన్నాడు. ఆ రాష్ట్రమాజీ మంత్రి షైక్ అబ్దుల్ జబ్బార్ ఉన్నాడు. సమాచారా శాఖ జాయిట్ డైరెక్టర్ గులాబ్ నబీ ఉన్నాడు. ఇవేవీ కూడా ‘ది కశ్మీర్ ఫైల్స్’ లో మచ్చుకు కూడా కనిపించవు.
పదేళ్ల కాలంలో 18691 మంది హత్యకాబడితే అందుకే 837 మంది మాత్రమే హిందువులు మిగతా వాళ్లంతా హిందూహేతరుకే..! హిందూ హేతరులను కూడా ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఆలోచిస్తే అసలు సమస్య అర్థం అవుతుంది. కానీ మన బుర్రలు అటువైపు దృష్టి సారించవు.
మనకంటి చూపు, మన దృష్టికోణం, మన మట్టి బుర్ర పాక్షిక సత్యానికి మాత్రమే అలవాటు పడింది. నిజం కంటే అబద్ధం మనకు ఎంతో ఇష్టం. మన మెదళ్ళు ఎప్పుడో ముస్లిం వ్యతిరేక ద్వేషంతో నిండిపోయాయి.
అందుకే మనకు కళ్ళముందు అసత్యం దర్జాగా ప్రచారం అవుతున్నా నోళ్లు మూసుకొని కూర్చుండి పోయాం. మన రక్తంలో హిందుత్వ భావజాలం పారుతోంది అందుకే మన ఆలోచనలు అణచివేయబడ్డాలు. మన ఆలోచనలు అన్ని ఇప్పుడు వాడి ఆధీనంలోనే ఉన్నాయి. ఇప్పుడిక సెలెక్టివ్ గా స్పందించే రోబోలం మాత్రమే మనం..!