నాకు కాదు ఈ జనానికి సిగ్గులేదు: పూనమ్ పాండే
ఇండియన్ గ్లామర్ ఇండస్ట్రీ కాస్త తెలిసిన వాళ్లకైనా భాష, ప్రాంత తేడాలు లేకుండా పూనమ్ పాండే పేరు తెలియని వాళ్ళు తక్కువే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతోనో, అద్దిరి పొయే గ్లామర్ ఫొటోలతోనో ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది ఈ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గ్లామర్ డాల్. మోడల్ గా ఆ తర్వాత నటిగా మారినా పూనం పాండే ఎక్కువగా గుర్తిపంపు తెచ్చుకున్నది మాత్రం వివాదాలతోనే. కాంట్రవర్సీ వార్తలతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది పూనం. ఇక తన అశ్లీల చిత్రాలని మార్కెట్ చేసుకోవటానికి పూనమ్ పాండే సొంతంగా ఓ యాప్ ని కూడా లాంచ్ చేసుకుంది.

‘లాక్ అప్’ అనే రియాలిటీ షోలో పాల్గొంటోంది. దీనికి హోస్ట్ కంగనా రనౌత్. ఇది కూడా సెలబ్రిటీలతో నిర్వహించే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో. తనతో పాటు షోలో పాల్గొంటున్న ఇతర కంటెస్టెంట్స్ అయిన అంజలి అరోరా, తహసీన్ లతో మాట్లాడుతూ పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇదంతా ఆమె యాప్ ని ప్రమోట్ చేసుకునే ట్రిక్ లో భాగంగానే చేసిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నా. పూనమ్ మాటలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. “నేను బట్టలు విప్పి చూపంచినంత మాత్రానే నేను సిగ్గులేని దాన్ని ఐపోతానా?. అది నేను ఒప్పుకోను. ఎప్పుడూ పక్కవాళ్లని ఇబ్బంది పెడుతూ, వాళ్ళని బాదపెట్టాలని చూసేవాళ్లే నిజంగా సిగ్గులేని మనుషులు” అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది.

అంతే కాదు మరో కంటెస్టెంట్ తహసీన్ మాటలకు సమాధానగా ” నెలకు 200 మిలియన్ల వ్యూస్ నా వీడియోలకు ఉంటున్నాయి, ఇంకా 60 మిలియన్ల ఇంప్రెషన్స్ వస్తాయి. ఇప్పుడు ఆ వీడియోలు చూస్తున్న వారంతా ఇక్కడి జనమే కదా? వీళ్లు రాత్రంతా నా వీడియోలు చూస్తారు. పొద్దునే లేచి నామీద ట్రోలింగ్ కి దిగుతారు. ఇప్పుడు నిజంగా సిగ్గులేనిది నాకా, నా వీడియోలు చూసేవాళ్లకా?, ను ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటానా లేదా ఇలాంటి విషయాల గురించే మాట్లాడుకుంటారు. కానీ నేను ఎలాంటి పనులు చేయాలో నిర్ణయించుకునే హక్కు నాకుందని వాళ్లకు తెలియదు” అంటూ జనాల హిపోక్రసీని తేల్చి పడేసింది.