రాధేశ్యామ్: ఆలస్యమే కలిసి వచ్చింది
సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాక అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోతే అది మైనస్ అనే అనుకుంటారు. ఇక ఒకసారి, రెండుసార్లో కాదు వరుసగా మూడు నాలుగు సార్లు ఇదే రిపీట్ అయితే, రోజులు కాకుండా నెలలపాటు సినిమా వాయిదా పడితే మాత్రం ఇక ఆ సినిమా మీద ఉన్న పాజిటివ్ అంచనాలు తగ్గిపోతాయి. ఇక నిర్మాతల కష్టాలు ఉండనే ఉన్నాయి.
అయితే ఈ వాయిదాలు రాధేశ్యామ్ విషయంలో మాత్రం మంచే చేశాయి అనుకోవాలి. నిజానికి పోయిన ఏడాదిలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తరవాత జనవరిలో “ఆర్.ఆర్.ఆర్” రిలీజ్ ఉంటుందనుకొని అప్పుడు కూడా వాయిదా వేసారు. అయితే ఇదే రాధేశ్యామ్కి మేలు చేసింది.

RRR తరవాత గనక రిలీజ్ అయి ఉంటే అనుకున్న స్థాయిలో వసూళ్లు ఉండేవి కాదు. రాజమౌళి సినిమా చూసిన ఊపులో ఇంకో సినిమా ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ని అందుకోవటం కష్టమే. ఇప్పుడు ఆ సమస్య లేదు. RRR కంటే ముందే రాధే శ్యామ్ వస్తోంది కాబట్టి. వసూళ్ల విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు. అదన్న మాట సంగతి. కూని సార్లు ఆలస్యం అమృతమే…