కండోమ్ టెస్టర్‌గా తన పాత్ర గురించి చెప్పిన రకుల్
తెలుగులో హీరోయిన్గా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవిడ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. తాజాగా రకుల్ బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది. తేజాస్ దర్శకత్వంలో, రోనీ స్క్రూవాలా నిర్మాణంలో రకుల్ నటిస్తున్న సినిమా ‘ఛత్రివాలి’
తేజస్ ప్రభ విజయ్ దేవస్కర్ దర్శకత్వంలో వస్తూన ఈ సినిమాలో రకుల్ కీలకప్రాత పోషిస్తోంది. ఛత్రివాలి అనే టైటిల్‌తో రూపొందిన ఈ సోషల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రకుల్ మునుపెన్నడూ చూడని, ప్రత్యేకమైన క్యారెక్టర్లో నటించింది. ‘ఛత్రివాలి’ సినిమాలో రకుల్ ‘కండోమ్ టెస్టర్’ క్యారెక్టర్ పోషిస్తోంది. గత నవంబర్లోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అయితే ఈ మధ్య ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడింది రకుల్.
‘ఈ సినిమాలో అసభ్యకర సన్నివేశాలేవి ఉండవు. ఈ చిత్రంలో ఫ్యామిలీస్ చూడలేనంత అసభ్యంగా ఏమీ చూపించడం లేదు. వాస్తవానికి ఫ్యామిలీ మొత్తం ఈ చిత్రాన్ని చూడాలి. ఇలాంటి పాత్రలు చేస్తే కెరీర్ పరంగా కొంచెం ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తాయి. అందుకే ఈ క్యారెక్టర్ని చేయాలని నిర్ణయించుకున్న. ఇక ఈ సినిమాలో నా పాత్ర గురించి నా తల్లిదండ్రులకు వివరించాను. వాళ్లు మరో ఆలోచన లేకుండా నన్ను చేయమని ప్రోత్సాహించారు.
ఇది మాత్రమే కాదు నేను చేసే ప్రతి సినిమా కథ గురించి అమ్మానాన్నలకు చెబుతాను. వారి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఓకే చెబుతాను. ఎందుకంటే మా పేరెంట్స్ కూడా ప్రేక్షకులే’ అని రకుల్ చెప్పుకొచ్చింది. కాగా ఛత్రీవాలి సినిమాతో పాటు హిందీలో అటాక్, రన్‌వే 34, డాక్టర్ జి, అయలాన్, మిషన్ సిండ్రెల్లా అనే చిత్రాల్లో నటిస్తోంది రకుల్.