ఈటీ… ఇరగదీస్తోంది
తమిళ హీరో సూర్య కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మన హీరోలతో సమానంగా సొంత మార్కెట్ ఉంది. ఇప్పుడు దక్షిణాది మొత్తం తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సత్తా చాటుతున్నాడు సూర్య.
ఈ మధ్య కాలంలో అతడు చేసిన రెండు సినిమాలు ‘ఆకాశమే హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీలోనే విడుదలయ్యాయి. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు ఫుల్ మీల్స్ పెట్టేందుకు ‘ఈటీ’ అనే సినిమాతో వచ్చాడు. సూర్యకు ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈటీ పేరుతో విడుదల చేసింది. ఈ చిత్రం హక్కులను ఫ్యాన్సీ ధరకు ఏషియన్సంస్థ సొంతం చేసుకుంది.
సూర్య థియేట్రికల్ సక్సెస్ దక్కించుకుని ఏళ్లు అవుతుంది. అందుకే ఈ సినిమా తో సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో సూర్య ఉన్నాడు. విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్ సక్సెస్ లను దక్కించుకున్న దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో ఈటీ రూపొందింది. తమిళంతో పాటు తెలుగు లో భారీ గా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. రాధేశ్యామ్ కు ఒక్క రోజు ముందు ఈ సినిమా విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈటీ పై ఉంది.

‘ఈటీ – ఎవరికీ తలవంచకు’. పాండిరాజ్ తెరకెక్కించిన ఈ మాస్ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించాడు. వినయ్ రాయ్, సత్యరాజ్, సూరి తదితరులు కీలక పాత్రలు చేశారు.
స్త్రీల సమస్యలపై పోరాడే పాత్రలో కన్నభిరన్ గా సూర్య నటన కేక పుట్టిస్తొందని అంటున్నారు. ఫస్టాఫ్ మాస్‌కి నచ్చే ఎలివేషన్స్‌తో, సెకండాఫ్ డీసెంట్‌గా సాగుతోందని.. మొత్తంగా సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్ల ముందు బాణాసంచా కాలుస్తూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కోటు వేసుకునే జడ్జి వేరే.. పంచె ఎగ్గడితే నేనేరా జడ్జిని… అమ్మాయిలు అంటే బహీనులు అనుకుంటారు. బలవంతులు అని నిరూపించాలి. లాంటి డైలాగులు బాగా పేలాయట.