మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్: RRR హవా మొదలైంది
పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ కోసం ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన సదరు సినిమా పాండమిక్ కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 25న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో భారీ రేంజ్లో విడుదల అవుతోంది.
బాహుబలితో తెలుగు సినిమా రేంజ్‌ను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ కావడంతో ఈ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఒకపక్క రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్‌కి రాజమౌళి లాంటి ట్యాగ్ తగలటం సినిమాని భారీ స్థాయికి తీసుకు వెళ్ళింది. బాహుబలి రేంజ్ హిట్ అని అప్పుడే మాట్లాడుకుంటున్నారు.
బాలీవుడ్ స్టార్స్ ఆలియాభట్, అజయ్ దేవగన్, శ్రీయ శరన్, ఓలివియా మోరీస్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించారు.

ఈ సినిమాను కోవిడ్ పరిస్థితులను బట్టి మార్చి 18న లేదంటే ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు తేదీలు కాకుండా మరో కొత్త విడుదల తేదీ మార్చి 25ని చిత్ర బృందం ఖరారు చేసింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యూఎస్‌లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ప్రీమియర్ షోస్‌కు అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ ప్రీమియర్స్ కోసం అభిమానులు పోటీపడిమరీ భారీగా టికెట్స్ కోనుగోలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు.
మార్చి 18న దుబాయ్‌లో RRR ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను జరపఘనుంది. అలాగే మార్చి 19న బెంగుళూరులో మరో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి, ఫైనల్‌గా హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.