పూరీకి తలనొప్పి తెచ్చిన “జనగణమన” పోటీ
ప్రతి డైరెక్టర్‌కీ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉన్నట్టే పూరీ జగన్నాథ్‌కు కూడా జనగణమన అనే ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. ఈ సినిమా మహేష్ బాబుతో తెరకెక్కించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. కానీ వాయిదా పడుతూనే ఉంది. ఈ సినిమా గురించిన టాక్ రాగానే మహేష్ బాబుతో ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా చాలానే వచ్చాయి. జన గణ మన కథని చాలాకాలం క్రితమే రాసుకున్నాడు పూరి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రతీసారి ఏదో ఒక అడ్డంకి వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆగిపోతూనే వచ్చింది. వర్కవుట్ కాకపోవడంతో దానిని పక్కన పెట్టి వేరే సినిమాలపై దృష్టి పెట్టాడు.
ఎట్టకేలకు ఈ సినిమాను విజయ్ దేవరకొండతో మొదలు పెట్టనున్నట్టు వార్తలు వచ్చాయి. నిర్మాతల్లో ఒకరైన చార్మి ఆల్రెడీ లొకేషన్ల వేటలో పడింది. ఆ మధ్య పూరీ మాట్లాడిన ఆయోను రిలీజ్ చేసింది. ‘ఇప్పుడే లైగర్ షూటింగ్ పూర్తైంది.. ఈ రోజుతో జనగణమన..’ అంటూ పూరీ మాట్లాడిన చిన్న ఆడియో బయటికి వచ్చింది.
లైగర్ ఆగస్ట్ 25న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అయిన వెంటనే సినిమా షూట్ కు వెళ్ళబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ నుంచే రెగ్యులర్ షూట్ మొదలవ్వొచ్చంటున్నారు. అయితే ఇప్పుడు ఇంకో కొత్త సమస్య వచ్చి పడింది. మరో రెండు భాషల్లో ఇదే టైటిల్‌తో సినిమాలు మొదలయ్యాయి. జయం రవి హీరోగా తమిళంలో ‘జన గణ మన’ తయారవుతోంది. ఇందులో తాప్సీ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రవి ‘పొన్నియిన్ సెల్వన్’తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెప్టెంబర్‌లో విడుదల కానుంది. ‘జన గణ మన’ కూడా త్వరలో విడుదలయ్యే చాన్స్ ఉంది.

మరోపక్క మలయాళంలో డిజో జోస్ ఆంటోనీ డైరెక్షన్ లో పృథ్విరాజ్ హీరోగా, సూజర్ వెంజరమూడు మరో కీలక పాత్రలో ‘జన గణ మన’ పేరుతో మరో సినిమా రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు తాజాగా పృథ్విరాజ్ ప్రకటించాడు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండల ‘జన గణమన’ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు కాలేదు. ఒకవేళ ఈ సినిమా ప్రకటన వస్తే తమ సినిమాకు ఇబ్బంది అని మళయాళ టీమ్ ముందే రిలీజ్ చేస్తున్నారట.

ఈ లెక్కన మళయాళ జనగణమన ముందు ఆ తరవాత తమిళం వచ్చాక పూరీ సినిమా రావాలి. ఇప్పటికే 100 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి ఇన్నిసార్లు రిపీట్ అయిన తైటిల్ తో మళ్ళీ రావటం కష్టమే… ఈ లెక్కన పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ టైటిల్ అయిమా మార్చుకోవాలి. లేదంటే అదే టైటిల్ కి మరో పదాన్ని జోడించాలి…. చూడాలి పూరీ నిర్ణయం ఎలా ఉండబోతోందో..