ఎలక్ట్రికల్ వాహనాలు ఎంతవరకు సురక్షితం?
పెరుగుతున్న ఇంథన ధరలు, వాతావరణ కాలుష్యం తగ్గించటానికి ఎలక్ట్రిక్ వాహనాలు సరైన ప్రత్యామ్న్యాయం అని చాలా మంది అనుకుంటున్నారు. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి.

నిజానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పెట్రో ఆధారిత ఉత్పత్తులకు మరొక ఆల్టర్నేటివ్ కావాల్సిందే. అయితే అంతా అనుకుంటున్నట్టుగా ఎలక్ట్రికల్ వెహికిల్స్ సురక్షితమైనవేనా?

చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎకో ఫ్రెండ్లీ అనే భ్రమల్లో ఉన్నారు . కాని, అది నిజం కాదు. వీటి వలననే పర్యావరణానికి ఎక్కువ ప్రమాదం. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌లో ముఖ్యమైన పార్ట్ బ్యాటరీ. ఈ బ్యాటరీని తయారు చేయటానికి కోబాల్ట్,గ్రాఫైట్,మాంగనీస్ లాంటి మినరల్స్ పెద్ద ఎత్తున అవసరం అవుతాయి.
ఈ మినరల్స్‌ని గనుల నుండి బయటకు తీయడంలో ఎమిషన్ అయ్యే కార్భన్ ఒక పెట్రోల్ వెహికిల్ నుండి జీవితకాలంలో ఎమిషన్ అయ్యే కార్భన్లో 50% ఉంటుంది.అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వాడకముందే ముప్ఫై వేల పౌండ్ల కార్భన్ డై ఆక్సైడ్ విడుదల అవుతోంది.
ఇప్పుడున్న ఎలక్ట్రికల్ వెహికిల్స్ దూరాలు ప్రయాణించటానికి సరిపోవు. ఎక్కువ దూరం ప్రయాణించేలా బాగాపనిచేసే ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి పెద్ద పరిమాణంలో ఉండే బ్యాటరీలు తయారు చేయాలి. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. అంత పెద్ద బ్యాటరీని అమర్చాలంటే వెహికిల్ బరువుకూడా పెంచాల్సి వస్తుంది. వాహనం బరువు పెరిగితే మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఎక్కువ బరువు ఉండకూడదు అంటే వెహికిల్ బాడీని తేలికగా ఉండే అల్యూమినియంతో తయారు చేయాల్సి వస్తుంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది.

ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు వాడే కరెంట్ కోల్ థర్మల్ స్టేషన్ నుండి వచ్చేదైతే ప్రతి కిలోమీటర్ కి 250గ్రాముల కార్భన్ డై ఆక్సైడ్ ను గాలిలోకి ఎమిట్ చేసినట్లు అవుతుంది.
పోనీ థర్మల్ పవర్ కాకుండా సోలార్ పవర్‌తో ఛార్జ్ చేస్తే ఈ వెహికల్ లక్ష కిలోమీటర్లలో పెట్రోల్ వెహికల్ నుండొచ్చే కార్భన్ డై ఆక్సైడ్ కంటే కేవలం అయితే 24%మాత్రమే తక్కువ రిలీజ్ చేస్తుంది. అంటే 76% పొల్యూషన్ వస్తుంది. అంత ఖర్చు చేసి ఆమాత్రం కాలుష్యం తగ్గించటం అంటే ఏమాత్రం ఉపయోగం లేనట్టే.
ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగాలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది.
రెగ్యులర్ ఇంజిన్‌తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగం పెరగటం వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఆ లెక్కన చూసుకుంటే ఎలక్ట్రికల్ వాహనాలు పెట్రోవాహనాలకంటే ఏమాత్రం కాలుష్యాన్ని నివారించలేవు.

ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. ఈ సమస్యలకి ఒక పరిష్కారం చూడకుండానే, కేవలం వాహనాల ధర తక్కువ అనే కారణంతో ఎలక్ట్రిక్ వాహనాలవాడక్లం మొదలు పెడితే వాతావరణాన్ని కాపాడటం మాట అటుంచి మరింత ప్రమాదంలోకి నెట్టినట్టే.
March 22, 2022 @ 10:09 pm
ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఒక అవగాహన ఇచ్చారు..
ఉపయోగకరమైన సమాచారం 👍
March 22, 2022 @ 10:10 pm
Useful information on Electric vehicles 👍