ఎండమండుతోందని చల్లగా బీరేస్తున్నారా? జాగ్రత్త
ఎండాకాలం మొదలైంది. దానితో పాటే వేడినుంచి తప్పించుకునే ప్రయత్నాలూ మొదలయ్యాయి. ఏయిర్ కూలర్స్, సమ్మర్ స్పెషల్ ఫుడ్స్ అంటూ వేసవి తాపాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు జనం. అయితే, ఎప్పటిలాగానే ఎండల తాపాన్ని చల్లటి బీరుతో తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు మందు బాబులు. కరోనాకి విరుగుడు కూడా మద్యంలో వెతుక్కున ఘనులు మనవాళ్లు. ఇప్పుడు ఎండవేడికి మాత్రం అదే మార్గం ఎంచుకోకుండా ఉంటారా?

మామూలుగానే వేసవి కాలంలో బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోతుంటాయి. మండే ఎండ నుంచి బయట పడాలంటే చల్లని బీరే చక్కని మార్గం అనుకుంటారు చాలామంది. కానీ, బీరు తాగడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదన్న వాదన కూడా ఉంది.
ఎండాకాలంలో సహజంగా చల్లని పానీయాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇక బీర్ల అమ్మకాల గురించి చెప్పనక్కరలేదు. బీరులో సాధారణంగా నీటి శాతం చాలా ఎక్కువగా ఉండి.. ఆల్కహాల్ శాతం పరిమితంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో బీరును ఆశ్రయించేవారు కూడా ఎక్కువే. కొంతమంది డీహైడ్రేషన్ కూడా తగ్గే అవకాశం ఉందని అనుకుంటూ ఉంటారు. ప్రపంచంలో కాఫీ, టీ ల తర్వాత ఎక్కువగా తాగేది బీర్. ఇది మూడవ స్థానంలో ఉంది.

అయితే, బీరు తాగటం వల్ల శరీరం చల్ల బడుతుందన్నది కేవలం అపోహ మాత్రమే. ఏడీహెచ్ అనే హార్మోన్ ప్రతీ మనిషి శరీరంలో ఉంటుందని.. అది శరీరంలోని నీటి శాతాన్ని కంట్రోల్ చేస్తుంది. కానీ ఆల్కహాల్‌తో కూడిన బీరు పానీయం సేవించడం వల్ల ఆ హార్మోన్ దెబ్బతినే అవకాశం కూడా ఉంది. బీర్ తాగిన తర్వాత చల్లగా ఉండటం నిజమే. కానీ, ఆల్కహాల్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత, ఇది అడ్రినలిన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది, హృదయ స్పందనను వేగవంతం చేస్తుంది. చమట రూపంలో శరీరం నుండి వేడిని పెంచుతుంది. దీనివల్ల దాహం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి.

బీరులో ఉండే ఆల్కహాల్ శాతం తక్కువే అయినా ఇది మూత్రపిండాలను ప్రేరేపిస్తుంది. జీవక్రియ, మూత్రవిసర్జనను వేగవంతం చేస్తుంది. దీని వల్ల శరీరం మరింత నీటిని కోల్పోతుంది. అంటే బీరు తాగటం వల్ల వేడిని తగ్గించుకోవచ్చు అనేది పూర్తిగా అపోహ మాత్రమే. బీర్ లో ఉండే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ ను విచ్చిన్నం చేసి ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీంతో మధుమేహం కూడా ఎటాక్ అవ్వొచ్చు.. ఇంకా బరువు కూడా పెరిగే ఆస్కారం ఉంది.

రోజుకు 1000ఎం.ఎల్ కంటే ఎక్కువ బీర్లు తాగకూడదని సూచిస్తున్నారు. శరీరానికి తగినంత నీటిని అందించడంలో బీరు కంటే కూడా సాధారణ నీళ్లు, స్పోర్ట్స్ డ్రింక్‌లు, ఆల్కహాల్ లేని బీరు తాగినప్పుడు మాత్రం ఫలితాలు కొంత మెరుగ్గా మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.

March 24, 2022 @ 11:53 am
విలువైన సమాచారం 🙏