ఆపిల్‌కు పోటీ…. (ఆ)అయా T1 Iphone vs Ayya T1
ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా యాపిల్, శాంసంగ్ సహా పలు టెక్నాలజీ సంస్థలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. తమ ఉత్పత్తులను రష్యాకు పంపబోమని యాపిల్ సహా దాదాపుగా అన్ని కంపెనీలు ప్రకటించాయి. యాపిల్ తయారీ మొబైల్ ఐఫోన్ అంటే..విశ్వవ్యాప్తంగా క్రేజ్ ఉన్న బ్రాండ్.
రష్యాలో ఐఫోన్ అమ్మకాలను విరమించుకుంటున్నట్టుగా ప్రకటించిన వారానికే. ఐఫోన్‌కు దీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్‌ను వినియోగించాలని రష్యా తన దేశ పౌరులకు పిలుపునిచ్చింది. ఆ ఫోన్ పేరును ‘అయా టీ1’గా రష్యా ప్రకటించింది. ఈ ఫోన్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోదట. ఇలాంటి అతి చిన్న విషయాల్లో కూడా రష్యా ముందే ఆలోచించటాన్ని చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.

అయ్యా టీ1 మొబైల్‌ను రష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసిందట. తమదేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ‘అయ్య టీ1(ఆYYఆ ట్1) అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ఐఫోన్లకు బదులు అయ్య టీ1 స్మార్ట్ఫోన్లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరడం గమనార్హం.
ఈ స్మార్ట్ఫోన్లలో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండడానికి కెమెరాలు, మైక్రోపోన్ను టర్న్ ఆఫ్ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్ బటన్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. తమపై నిఘా పెట్టాలనుకునే వ్యక్తుల ఫోన్ల మైక్రోఫోన్, కెమెరాలను అయ్యా టీ1 స్వయంగా టర్న్ ఆఫ్ చేసేస్తుందట.
ఈ ఫోన్ త్వరలో మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచి రష్యన్ తయారు చేసిన అరోరా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయనుందని సమాచారం. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించారట.
6.5 అంగుళాల డిస్ప్లే, 4జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ స్టోరేజీ, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, రెండు ప్రధాన కెమెరాలు, 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.