ఒత్తిడి పెరుగుతోంది… గమనించుకోండి….
ఉన్నదో లేనిదో… ఎంతోకొంత బతుకు మీద భరోసా ఉండేది. ఇవాళ కాకుంటే రేపు అన్న ధైర్యం ఉండేది. ఈ సిటీలో రోజుకూలీల దగ్గరనుంచి కార్పోరేట్ టైకూన్స్ వరకూ ఎవరి టార్గెట్స్ వాళ్లవి. రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉన్నా అది ఇప్పుడున్నంతగా మాత్రం కాదు. కెరీర్ బిల్డ్ చేసుకునే ఆలోచనలు కాకుండా…. భయం, యాంగ్జైటీ ఎక్కువగా ఉంటోంది.
కోవిడ్ తరవాత పరిస్తితి మారిపోయింది. మూడేళ్ళుగా అందరిలోనూ ఆందోళన పెరుగుతోంది. ఆరోగ్యం మీద భయం, ఉద్యోగం మీద భయం, ఆఖరికి అడుగు బయట పెట్టాలంటే భయం. రోజు రోజుకీ ఈ భయాలు పెరుగుతూ ఫోబియాలుగా మారుతున్నాయి. సైకాలజిస్టులూ, సైకియాట్రిస్టుల దగ్గరైకి వచ్చేవాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. అసలు అది మానసిక సమస్య అని, డాక్టర్ ని కలవాలి అని కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు.
కోవిడ్ అనంతర వాతావరణం ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే.. ఎన్నో రకాల అడ్డంకులని ఎదుర్కుంటూ వచ్చిన వాళ్లు కూడా ఈ టైంలో డిప్రెషన్ వైపు వెల్లొద్దు అని చెబుతున్నారు సైకాలజిస్టులు. ఇంతకీ ఆ భయాల వల్ల వచ్చే ఫోబియాలు ఏమిటి? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే…

బైపోలార్డిజార్డర్
ఇది నార్మల్ గానే అందరిలో ఎంతోకొంత ఉంటుంది. మామూలుగా అయితే భయపడాల్సినపని లేని డిజార్డర్ కానీ ఇవే ఆలోచనలు పెరుగుతూ పోతే మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది.
చాలా సంతోషంగా, ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో కనిపిస్తూనే కాసేపటిలోనే మళ్లీ నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదు, నేను ఒంటరినీ అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోవటం ఉంటుంది. కాన్ఫిడెంట్ గా ఉండాలనుకొని డబ్బు విపరీతంగా ఖర్చు పెట్టటం, ఎవరినీ లెక్క చెయ్యకుండా గర్వంగా ప్రవర్తించటం మెయిన్ లక్షణాలు. డిహ్జార్డర్ ఎక్కువయ్యే కొద్దీ నిరాశ, సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ తగ్గిపోయి ఒంటరిగా ఉంటూ బాధపడటం చేస్తుంటారు. బైపోలార్డిజార్డర్ను రెండు విధాలుగా చెప్పవచ్చు. ఎక్కువ ఎగ్జయిట్మెంట్కనిపిస్తే హైపోమేనియా అని, కుంగిపోవడాన్ని బైపోలార్డిప్రెషన్అని అంటారు. సిటీలో ఇది 10-15 శాతం మందికి ఉన్నట్లు సైకియాట్రిస్టులు చెబుతున్నారు. బైపోలార్డిజార్డర్ను రెండు రకాలుగా ఉంటుంది. ఎక్కువ ఎగ్జయిట్‌మెంట్‌కు ఉంటే హైపోమేనియా అని, కుంగిపోవడాన్ని బైపోలార్డిప్రెషన్అని పిలుస్తారు. బైపోలార్ డిజార్డర్ (భిపొలర్ దిసొర్దెర్)ను ఇదివరకు మానిక్ డిప్రెషన్ అనేవారు. ఇది పని ఒత్తిడి ఎక్కువగా ఉండే వాళ్లలో ఎక్కువగా కనిపించేది. లేదంటే… ప్రేమించిన వాళ్లు దూరమైన, అయిన వాళ్లు చనిపోయినా, ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నా, డ్రగ్ఎడిక్ట్స్లో కనిపించే బైపోలార్ డిజార్డర్ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తోంది. మొదట్లోనే గుర్తిస్తే చిన్న కౌన్సిలింగ్‌తో తగ్గిపోతుంది. కానీ పట్టించుకోకుంటే మాత్రం ఆత్మహత్య లాంటి తీవ్రమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పది పదిహేను రోజుల్లోనే నేను నార్మల్ అన్న ఫీలింగ్ కనిపిస్తే అది మరింత ప్రమాదకరం. ఈ డిజార్డర్ చాలాకాలం ఉండే సమస్య. త్వరగా రికవర్ అయినట్టు కనిపిస్తే అది ఇంకా తీవ్రంగా మారినట్టే. బైపోలార్డిజార్డ్లో ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ గా అర్థం చేసుకోవాలి. మరింత జాగ్రత్తగా ఉండాలి.
యాంగ్జయిటీ
ప్రతీ చిన్న విషయానికి ఎక్కువగా రియాక్ట్ కావటం ఉంటుంది. ఏదైనా చిన్న విషయం విన్నా గుండె దడ, నాలుక తడి ఆరిపోవడం, ఛాతీ బరువెక్కడం, కాళ్లు, చేతులు వణకడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా కనీసం పది, ఇరవై నిమిషాల వరకూ ఆ ఎఫెక్ట్ తగ్గదు. దీన్నే యాంగ్జైటీ అంటారు. హైదరాబాద్ లో ఈ ప్రాబ్లెం 5-10 శాతం మందిలో ఉండొచ్చు. చిన్నప్పటి చెడు అనుభవాలు అలా సబ్ కాన్షియస్ మెమొరీలో ఉండి పోవటం. పని ఒత్తిడి వల్ల ఈ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. కౌన్సెలింగ్ తో పాటు, బిహేవియర్ థెరపీ యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ అవసరం అవుతాయి.
డిప్రెషన్
ఎప్పుడూ ఏదో అలోచనల్లో ఉండటం, ప్రతీ విషయానికీ అనుమాన పడటం. ఎవరో చెవుల్లో మాట్లాడుతున్నట్టు అనిపించటం. తమలో తాము మాట్లాడుకోవడం, నవ్వుకోవడం, సెల్ఫ్ హైజీన్ ఉండకపోవటం, అనవసరంగా అందరినీ తిట్టటం, ఒంటరిగా ఉంటూ ఏడవటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మిగతా సమస్యలన్నిటికీ ఇలాంటి డిప్రెషన్నే మూలం. చాలా రోజులు ఉంటుంది. అందుకే డిప్రెషన్ డిజార్డర్ గా మారిపోతే బయటపడటం కష్టం. వీలైనంత త్వరగా సైకాలజిస్ట్ ని మరీ అవసరం అయితే సైకియా ట్రిస్ట్ ని కలవాల్సి వస్తుంది.

సోషల్యాంగ్జయిటీ
నలుగురికంటే ఎక్కువమంది ఉంటే ఆ బ్యాచ్ లో కలవటానికి కొడా భయం ఉంటుంది. స్టేజ్ ఫియర్, కొత్తవాళ్లతో మాట్లాడాలన్నా చెమటలు పట్టటం. ఆఫీస్ లో చిన్న సమస్య వచ్చినా పని మీద కాన్సంట్రేషన్ తగ్గిపోవటం. ఆఫీస్ వర్క్ లో మనల్ని ఎవరో గమనిస్తున్నారు అనిపించటం లాంతి లక్షణాలన్నితికీ కారణంసోషల్ యాంగ్జైటీ డిజార్డర్. ఈ నాలుగు, అయిదు నెలల్లో ఎక్కువగా వస్తున్న కేసులు ఇవేనట. అయితే ఇది మరీ పెద్ద సమస్య కాదు కొద్దిగా కౌన్సిలింగ్ తో ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది. మరీ అవసరం అయితే మందులు వాడాల్సి ఉంటుంది.
పోస్ట్ట్రమాటిక్స్ట్రెస్
గతాన్ని తలుచుకొని బాధపడటం. ఇదీ ఎంత ఎక్కువగా ఉంటుందీ అంటే కనీసం టీవీలో, సినిమాలో చూసిన సంఘటనలని కూడా మళ్లీ మళ్లీ తలుచుకుని బాధపడతారు. ఎక్కువగా పీడకలలు, నిద్రలో మూత్రవిసర్జన లాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి. ఏ పని చేసినా అదే సంఘటన గుర్తుకు వస్తుంది. అనవసరమైన భయాలు పెరిగిపోతాయి. అంటే నాకు ఆక్సిడెంట్ అవుతుందేమో, ఇంట్లోవాళ్లు, ఇష్తమైన వాళ్లు చనిపోతారేమో అని తలుచుకుంటూ ఎక్కువగా బాధపడుతుండటం ఉంటుంది. దీనికి కూడా ఎక్కువ భయపడాల్సిన పని లేదు. కొద్ది పాటి కౌన్సిలింగ్ తో ఈజీగా బయట పడొచ్చు.
అబ్సెసివ్కంపల్సివ్డిజార్డర్
కోవిడ్ సీజన్ మొదలైన దగ్గరనుంచీ ఓసీడీ 9అబ్సెసివ్కంపల్సివ్డిజార్డర్) సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మామూలుగనే మన అందరిలో కొద్దిగా ఉండే లక్షణమే. అతి శుభ్రత, అతి జాగ్రత్త లాంటివి ప్రిగిపోతాయి. అంటే ఒకసారి చేసిన పనినే మళ్లీ మళ్లీ చెయ్యటం. ఎక్కువగా చేతులు కడగటం, రోజులో ఎక్కువసార్లు స్నానం చెయ్యటం లాంతి పనులతో మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేంత భయపడుతూంటారు. తెలుగులో ఇదే సబ్జెక్ట్ తో మహానుభావుడు అనే సినిమాకూడా వచ్చింది. కాకుంటే సినిమాలో కనిపించినంత కామెడీగా మాత్రం ఉండదు ఈ డిజార్డర్. బిహేవియర్ థెరపీ అవసరం పడుతుంది. ఎక్కువ కాలం మందులు కూడా వాడాల్సి వస్తుంది.
పానిక్డిజార్డర్
ఇది ఒకరకంగా యాంగ్జైటీ లాంటిదే. అతి భయం, చిన్న విషయాలకే వణికి పోవటం, ఎక్కడో ఎవరో చనిపోయారు అన్న విషయం విన్నా నేనూ చనిపోతానేమో అని అతిగా భయపడటం ఉంటుంది.
సూడో డిమెన్షియా
మతిమరుపు మామూలే అనుకుంటాం కానీ సూడో డిమెన్షియా వల్ల వచ్చే మతి మరుపు చాలా ప్రమాదకరం. ఒకప్పుడు ఓల్ద్ ఏజ్ వాళ్లలో కనిపించే ఇలాంటి మతిమరుపు ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో కన్పిస్తోంది. డిప్రెషన్ లో ఉన్నప్పుడు చాలా పనులు ఆలోచన లేకుండా చేస్తుంటారు. ప్రతీ పనిలోనూ ఏదో ఒకటి మర్చి పోతుంటాం. అయితే ఇది కూడా ఎక్కువ భయపడాల్సిన సమస్య కాదు. పనిలో, రొటీన్ లైఫ్ లో ఉండే డిప్రెషన్ ని తగ్గించుకుంటే చాలు. కొన్ని సార్లు డాక్టర్ అవసరం కూడా ఉండదు.

సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్
మన గురించి మనమే ఎక్కువగా వూహించుకోవడం. ఎదుటి వ్యక్తి అంటే లెక్కలేనితనం సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందనటానికి మొదటి ఇండికేషన్. అందరికన్నా నేనే గొప్ప, కానీ నన్ను ఎవరూ గుర్తించటం లేదు అన్న ఆలోచన వస్తూ ఉంటుంది. హ్యూమన్ రిలేషన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చివరికి కుటుంబ సభ్యులు కూడా దూరమయ్యే పరిస్థితి వస్తుంది.
ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ఈ మధ్య ఎక్కువగా యూత్ లోనే కనిపిస్తోంది. నేను ఏదీ చెయ్యలేను, అందరికన్నా నేను తక్కువ అనుకుంటూ సెల్ఫ్ కంప్లైనింగ్ ఎక్కువగా ఉంటుంది. దీనికి కూడా చిన్న తనం నుంచీ ఉన్నకారణాలతో పాటూ డిప్రెషన్ కారణం అవుతుంది.
స్లీప్డిజార్డర్
సిటీ, విలేజ్ అనికాకుండా అందరిలోనూ పెరిగిపోతున్న సమస్య ఇదే.
పని ఒత్తిడి, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల స్లీప్డిజార్డర్ఎక్కువగా అటాక్ అవుతోంది. ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్ల వల్ల కూడా స్లీప్ డిజార్డర్ వస్తుంది. ఇది చాలా రకాల హెల్త్ సమస్యలకి కారణం అవుతోంది. అయితే ఈ డిజార్దర్ ని కూడా మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే మాత్రం సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది.
బయట పడటం ఎలా?
ఇలాంటి ప్రతీ సమస్యకీ సొల్యూషన్ మనలోనే ఉంటుంది. అనవసర భయాలు ఏవీ, నార్మాలిటీ ఏదీ అని ప్రశంతగా ఆలోచించాలి.
మంచి హెల్తీ ఫుడ్ చాలా అవసరం. చాలా వరకు సమస్యలు మంచి ఫుడ్ తోనే సాల్వ్ అయిపోతాయి. పండ్లూ, కూరగాయలూ, ప్రొటీన్ ఫుడ్ అవసరం.
మామూలుగా చేసే వర్క్ అవుట్స్ తో పాటు రెస్పిరేటరీ ఎక్సర్ సైజెస్ కూడా అవసరం.
ఫ్యామిలీ మెంబర్స్, దగ్గరగా ఉండే ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం గడపాలి
*వీలైనంతగా ఇంకోకళ్లకి సహాయం చెయ్యటం వల్ల కూడా మనలో పాజిటివ్ ఆటిట్యూద్ పెరుగుతుంది.
ఆల్కహాల్, మత్తుమందులు, గుట్కా, సిగరెట్‌లాంటి అలవాట్లకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి.
జాగ్రత్తలు తీసుకుంటూ అప్పుడప్పుడూ కొద్దిదూరం నడవటం, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లటం కూడా మనలో ఉండే డిప్రెసివ్ మూడ్ ని తగ్గిస్తుంది. టైం కి నిద్ర పోవడం…ఆహారం తీసుకోవడం అవసరం.
ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అసలు ఖాళీ లేకుండా టెన్షన్ వాతావరణం లో పని చేయటం చాలా సమస్యలకు కారణం అవుతోంది.
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా కి ఎక్కువగా అడిక్త్ అవకుండా. ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి. అమనకు అవసరం లేని విషయాల గురించి అనవసరంగా వర్రీ అవటం తగ్గించుకోవాలి.
ఎక్కువగా టీనేజర్లు ఉంటున్నారు..
“ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ ఉంది. జాబ్ పోతుందనో, ఫ్యూచర్ లో ఎలా బతకాలి అనో..ఇలాంటి భయాలతోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఇది పెద్ద సమస్య కాదు అని అర్థం చేసుకుంటే చాలు. చిన్నగా ఇబ్బందులు రావచ్చు కానీ మరీ మనం బతకలేనంత దారుణమైన పరిస్థితి మాత్రం ఉండదు. మనం కష్టపడగలం, ఏదైనా చెయ్యగలం అన్న సెల్ఫ్ కాన్ ఫిడెంన్స్ ఉంటే చాలు. ఏదైనా మనల్ని ఏమీ చెయ్యలేదు. పైన సమాచారమంతా మన అవగాహన కోసమే కానీ భయపడటానికి కాదు. జస్ట్ ఫీల్ ఫ్రీ, భయపడుతున్నంత సేపూ సమస్యలు కనిపిస్తూనే ఉంటాయి.” అని చెబుతారు. ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్. తన దగ్గరికి వచ్చేవాళ్ళ సంఖ్య పెరిగిందని, అందులో ఎక్కువగా టీనేజర్లు ఉంటున్నారని చెప్పారాయన.

జాగ్రత్తగా చూసుకోవాలి.
మన ఇంట్లో ఎవరైనా సైకలాజికల్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు. వాళ్ళ బిహేవియర్ మీద ఎక్కువ చిరాకు చూపించకూడదు. వాళ్లు బాధ పడుతున్నారనీ, కావాలని అలా చేయటం లేదని అర్థం చేసుకోవాల్సింది మనమే. ఏ డిజార్డర్ లక్షణాలు కనిపించినా వాళ్లతో జాగ్రత్తగా మట్లాడాలి. వీలైనంత త్వరగా సైకియాట్రిస్ట్ దగ్గరకి తీసుకు వెళ్లటానికి ఒప్పించాలి.
మనం ఏమాత్రం వాళ్లని చిరాకుగా చూసినా, ఎప్పుడూ చిరాకు పడుతూ ఉన్నా అది వాళ్లని ఇంకా డిప్రెస్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. ఒంటరిగా విడిచి పెట్టకూడదు. ప్రేమగా మాట్లాడుతూ సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ ని పెంచాలి. కోలుకుంటున్న టైంలో, ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఇంతకు ముందు చేసిన పనులని గుర్తు చేయకూడదు. అసలు వాళ్ల ప్రవర్తన అలా ఉండేది అని ఏమాత్రం వాళ్లదగ్గర మాట్లాదకూదదు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రమాదకరమైన వస్తువులు. అంటే సూసైడ్ చేసుకోవటానికి పనికి వచ్చే వస్తువులని వాళ్లకి దూరంగా ఉంచాలి.