వీగన్ మీట్ అంటే ఏమిటి? అది సురక్షితమేనా?
దాదాపుగా భూమి మీద జీవం ఉన్న ప్రతీ ప్రాణికీ ప్రొటీన్ అవసరం. కొన్ని రకాల మొక్కలతో సహా మాంసం మీద ఆధారపడే ఈ ప్రొటీన్ ని సమకూర్చుకుంటాయి. అయితే జీవ హింస అనే కారణం ఒకటైతే, ఆహారం కోసమే పెంచుతున్న జంతువుల వ్యర్థాల వల్లకూడా ఇబ్బంది తలెత్తుతోంది.

ఇక వాటిని త్వరగా పెంచటానికి, ఆరోగ్యంగా ఉంచటానికి ఇచ్చే టీకాలూ, మందులవల్ల ఆమాంసం మనకూ ప్రమాదకరంగా మారే దశకి వచ్చింది. ఈ సమయంలో ఆల్టర్నెట్ మార్గంగా వచ్చిన పద్ధతే కృత్రిమ మాంసం.
కోళ్లు త్వరగా పెరగడానికీ, బలిష్టంగా అవ్వడానికీ వాటికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తారు. అవి మనుషులకు విషపూరితమైనవి. అందువల్ల చికెన్ ఎక్కువగా తింటే విషాన్ని కూడా తింటున్నట్లే అనుకోవచ్చు.

కోళ్లు.. గొర్రెలు లాంటి పశువుల మాంసాన్ని మరింత వృద్ది చేయటానికి ఇంజెక్షన్లు ఇచ్చి కృత్రిమంగా తయారు చేస్తున్నారని.. వీటి కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని.. ఈ సమస్య తాజా వెజ్ మీట్ తో తప్పుతుందని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణులు కూడా.
ఇప్పటికే భూమ్మీద ఉన్న వ్యవసాయ భూమిలో సగం భూమిని మాంసం ఉత్పత్తి కోసం వినియోగిస్తున్నారు. పశువులకు అవసరమైన దాణా, గింజలు, వాటి పోషణకు అవసరమైన నీరు తదితర ఇతర వనరుల కోసం ఇంత భూమిని వాడుకుంటున్నాం.
ఇవేవీ లేకుండా ఒక ఫ్యాక్టరీ, పెరుగుదలకు ఉపయోగపడే ఎంజైమ్స్‌తో కావాల్సినంత మాంసం సృష్టించేందుకు చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలే ఓ మోస్తరు విజయం సాధించాం. పదేళ్ల కిందటే ఖైమా కొట్టిన మాంసం లాంటి పదార్థాన్ని తయారు చేయగలిగినా కొన్ని ఇబ్బందులతో ఆ టెక్నాలజీ ముందుకు సాగలేదు.
రాబోయే సంవత్సరాల్లో అయితే ఓ కొత్త ఫార్ములాతో మాంసాన్ని తయారు చేసి మార్కెట్లో అమ్మే ఆలోచనలో ఉన్నారు. ఈ మాంసం తినడం ద్వారా ఆరోగ్యపరంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్యాక్టీరియా కలుషితం కూడా లేదు.
ఇక జంతువధ ఎలాగూ ఉండదు. కాబట్టి తద్వారా వచ్చే పర్యావరణ సమస్యలూ తగ్గిపోతాయి. సురక్షితమైన, ఆరోగ్యకరమైన, ఎక్కువకాలం నిల్వ ఉండే మాంసాన్ని తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. సోయా బీన్స్, లెంటిల్స్, క్వినోవా, కోకోనట్ ఆయిల్, పచ్చిబఠాణీలు, ప్రోటీన్లు అధికంగా ఉండే కూరగాయలు, బియ్యం, గోధుమల్లోని గ్లూటెన్ వంటివి ఉపయోగిస్తారు.
అలాగే ఈ శాకాహారి మాంసం రుచిని పెంచేందుకు కొబ్బరి నూనె, సుగంధ ద్రవ్యాలు, దుంపల నుంచి తీసిన సారాలు కూడా ఉపయోగిస్తారు. ఇన్ని పదార్థాలు ఉపయోగిస్తారు కాబట్టే సాధారణ మాంసం కన్నా ఇది చాలా ఎక్కువ రేటు ఉంటుంది.
తాజాగా 2018లో ఇజ్రాయెల్ కంపెనీ ఆలెఫ్ ఫామ్స్ తొలిసారి ల్యాబ్‌లోనే స్టీక్ (మాంసపు ముక్క)ను తయారు చేసింది. మరింకేం అలెఫ్ ఫామ్స్ లాంటివి ఊరుకొకటి పెట్టేస్తే సరిపోతుంది కదా అంటే.. దానికి ఇంకొంచెం సమయం ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి ల్యాబ్‌లో పెంచిన మాంసం ఖరీదు చాలా ఎక్కువ.

అయితే ఈ మీట్ వల్ల కూడా చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటిలో అధిక ప్రోటీన్, తక్కువ సంతృప్త కొవ్వులు, తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. కానీ సోడియం కంటెంట్ మాత్రం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉంటుంది కాబట్టే చాలా మితంగా తినాలి.
శరీరంలో సోడియం ఎక్కువయితే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది. బీపీ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే. అయితే దీన్ని సాధారణ మాంసంతో పోలిస్తే మాత్రం నిస్పందేహంగా దాని కన్నా ఆరోగ్యకరమైనదే. అవసరాన్ని మించిన ఆహారం ఏదైనా ప్రమాదకరమే.
2011తో పోలిస్తే రేటు గణనీయంగా తగ్గినా మరింత తగ్గితే గానీ అందరికీ అందుబాటులోకి రాదు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌లోనే ఇంకో కంపెనీ వాణిజ్యస్థాయిలో చికెన్ ముక్కలను తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తోంది. తాజాగా బాలీవుడ్ స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట వీగన్ మీట్ తయారీ స్టార్టప్ అయిన ‘బ్లూ ట్రైబ్స్ ఫుడ్స్’లో పెట్టుబడులు కూడా పెట్టారు.

అలాగే మరో బాలీవుడ్ జంట రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా కూడా ‘ఇమేజిన్ మీట్స్’ అనే బ్రాండ్‌ను తీసుకువచ్చారు. వీటితో కూడా బర్గర్ లు, నగ్గెట్స్, సాసేజ్లు, స్టీక్స్ వంటి వంటకాలు కూడా తయారుచేసుకోవచ్చు.
డిగ్రీ స్థాయిలో ఈ కోర్సులదే రాబోయే కాలం - UNPUBLISH.IN
March 21, 2022 @ 9:14 am
[…] […]