World Poetry Day ప్రపంచ కవితా దినోత్సవం
కవితా దినోత్సవం సందర్భంగా…. కొందరు తెలుగు కవులూ వారి కవితలూ…
వీళ్ళంతా ముందు తరాలూ, సమకాలీన సాహిత్యంలో వెలుగుతున్న వాళ్లూ.. నాలుగు అక్షరాలతో మెదళ్లని కదిలిస్తున్నవాళ్లూ..

నిప్పులు చిమ్ముకుంటూ ..నింగికి నే నెగిరిపోతే, నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు క్రక్కుకుంటూ..నేలకు నే రాలిపోతే, నిర్దాక్షిణ్యంగా వీరే…
– శ్రీ శ్రీ

నువ్వు ఉరిమి చూసినప్పుడు ఊరంతా పాలేర్లే
వాళ్ళే ఊరినించి తరిమికొడితే నీ బ్రతుకంతా పల్లేర్లే”
– అలిశెట్టి ప్రభాకర్

జీవితానికి మరణానికి మధ్య నన్ను హల్లో అని పలకరించే
సరిహద్దు రేఖ మీద
పసిపాపలాంటి వృద్ధాప్యంలో నిబ్బరంగా నిలబడి
చిరుగాలి సితారా సంగీతాన్నిపలికించే వేళ, పలవరించే వేళ
జీవితమా నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు.
– శివసాగర్

నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ కలమెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది.
– గుంటూరు శేశేంద్ర శర్మ

కవీ, రచయిత రాజద్రోహమే చేయాలి
లేకుంటే ప్రజా ద్రోహం అవుతుంది
– వరవర రావు

జీవితం అనాసక్తంగా అనిపించే రోజులు అందరికీ వుంటాయి.
ఆసక్తి కలిగించే వాటి వైపు జీవితాన్ని మళ్ళించడమే సవాలు … ఎవరికైనా !
– విజయ్ కుమార్ కోడూరి

ఎంత కావాలి
మనలాంటోళ్ళకు? ఎప్పుడెప్పుడు మన కడుపు నిమురుదామా
అని ప్రేమగా చూస్తున్న ఈ ఒక్క అర్ధపావు బియ్యం చాలు.
– మోహన్ రుషి

అతనెప్పుడూ..
సముద్రుడై తనలోకి, ఆమెను ఒంపుకోవాలని చూస్తాడు.
ఆమే.. ఓ కల్లోలసంద్రం అని గ్రహింపులేక.
– రూపా రుక్మిణి

ఏదో ఒక రంగు పూసి
నిర్ధారణ చేయడానికి
ఇంటి గోడలు.. ప్రహరీలు.. కాదు..
మనసులు .!
-షాజహానా బేగం

కవిత్వం రాయడానికి
కొంచం కొంచం విషంతిని పెరగాలి !
కవి కావడానికి
శిరస్సును,నరుక్కొని బతకాలి !!
– ఆశారాజు

పువ్వుల లోపల నిద్రిస్తున్నవాడికి
ఇంద్రధనుస్సుల అవసరమే రాదు.