మారుమూల గ్రామంలో లైబ్రరీ ఓపెనింగ్.. పుస్తకాలు డొనేట్ చేసిన జిల్లా అధికారి తిలక్
ఏపీలోని అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం పొట్టిపాడు గ్రామంలో మంగళవారం గ్రంథాలయాన్ని ప్రారంభించారు. మారుమూల గ్రామమైన పొట్టిపాడులో విద్యార్థులకు, నిరుద్యోగ యువకులకు, పుస్తకాభిమానులకు అందుబాటులో ఉండేందుకు గాను ‘అంబేత్కర్ విజ్ఞాన కేంద్రం’ పేరుతో లైబ్రరీ ఏర్పాటు అయ్యింది. జిల్లా అధికారి విద్యాసాగర్ తిలక్ ఈ లైబ్రరీని ఓపెన్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనం అనేది ఒక మంచి హాబీ అన్నారు. మన పాఠ్య పుస్తకాలే కాకుండా ఇతర పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే మరింత విజ్ఞానం అందుతుందన్నారు.
ఈ సందర్భంగా తన వంతుగా 50 పుస్తకాలను డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వస్తాయని విద్యాసాగర్ చెప్పారు. అంతుకు ముందు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.