చిన్న జియర్ గాడొక యూజ్ లెస్ ఫెలో: వైరల్ అవుతున్న అశ్వినీ దత్ వ్యాఖ్యలు
సమ్మక్క సారలమ్మ జాతరను కించపరుస్తూ చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగుతోంది. వాళ్లు దేవతలు కాదని చెబుతూ.. ‘‘వాళ్లేం దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటి చరిత్ర..? ఏదో ఒక అడవి దేవత… గ్రామదేవత… అక్కడుండేవాళ్లు చేసుకోనీ, సరే… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు… ఆ పేరిట బ్యాంకులే పెట్టేశారండీ ఇప్పుడు… అది వ్యాపారమైపోయింది ఇప్పుడు… ఎంత అన్యాయం..? అది ఒక చెడు… కావాలనే దీన్ని వ్యాపింపజేస్తున్నారు సమాజంలో…’’ అంటూ ఆ వీడియోలో చినజీయర్ స్వామి వన దేవుతల్ని కించ పరిచేలా మాట్లాడారు.

ఈ వీడియో పాతదే అయినా ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియాలో కనపడటంతో పెద్ద దుమారమే రేగుతోంది. నిరసనగా మేడారంలో చిన్న జీయర్ స్వామి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. చిన్న జీయర్ స్వామి చిత్రపటానికి చెప్పుల దండలు వేసి ఆదివాసీ గిరిజనులు తమ నిరసనను తెలియజేశారు. అగ్రకులాల అహంకారాన్ని ప్రదర్శిస్తూ చిన్న జీయర్ స్వామి వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. తక్షణం చిన్నజీయర్ స్వామి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చినజీయర్ స్వామి మీద ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సమ్మక్క-సారక్కలు దేవతలు కారని, వాళ్లేమైనా బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కామెంట్లపై సీతక్క తీవ్రంగా విమర్శించారు. ఆయన తెలంగాణ ప్రజలకు, ఆదివాసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రజలంతా దర్శించుకునే అడవి తల్లులకు ఒక్క రూపాయి కూడా లేదని, అదే మీరు 120 కిలోల బంగారంతో నిర్మించిన సమతామూర్తిని దర్శించుకోవడానికి 150 రూపాయలు టికెట్ పెట్టారన్నారు. ఆమె ట్వీట్‌కు వస్తోన్న స్పందన కూడా బాగానే ఉంది.

ఈ విమర్శలన్నీ ఒక ఎత్తయితే… సినీ నిర్మాత అశ్వినీ దత్ చేసిన విషయం మరో ఎత్తై కూచుంది. ఒక న్యూస్ ఛానెల్ డిబేట్ లో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన ఆయన ” ఒక్క మాటలో చెప్పాలంటే నేను ప్రత్యక్షంగా రెండు మూడు సార్లు అక్కడికి వెళ్ళాను. మా అన్నయ్య డాక్టర్ కదా, ఆయనా, మా సిస్టరూ ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళాము. అక్కడ వాళ్లు ఎంత భక్తి పారవశ్యంతో ఆ కార్యక్రమాలు చేస్తారో చూసిన తరవాత నాకో విషయం అర్థం అయ్యింది. ఈ చినజీయర్ గాడు వీడొక వెధవ. I am telling you frankly వీడు బ్లాక్ టికెట్లు అమ్మాడు అనే అభియోగమా వీడి మీద ఉంది. వీడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కాదు. ఇతన్ని అప్పట్లో మా ఎమ్మెల్యేలూ, ఎమ్మెల్సీలూ కొంతమంది చంద్ర బాబు నాయుడు గారి దగ్గరికి తీసుకు వెళ్లాలని ట్రై చేసారు. ఆయన ఒకటే మాటన్నాడు ‘‘మనం ప్రజలకు సేవ చేద్దాం తప్ప ఇట్టాంటాడి దగ్గరికి వెళ్లేదేమిటి?’’ అని. ఏమండీ, అలాంటి వెదవన్నర వెదవ. వీడు కనపడిన చోటల్లా వీలైనంత డబ్బు పోగేసుకొచ్చాడు. ఇప్పుడు దానికి రెస్పాన్సిబులిటీ ఫేస్ చేయాలి. అది ఎలా చేయాలో వాడికి తెలియటం లేదు. ఇవన్నీ ఆపటంకోసం టాపిక్ డైవర్ట్ చేయటానికి ఈ యూజ్ లెస్ ఫెల్లో గాడు వాగిన పిచ్చి వాగుడు ఇదంతా.” అని అశ్వినీ దత్ చెప్పిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది.