హ్యాకర్ల చేతిలో శాంసంగ్, గెలాక్సీ యూజర్ల డాటా సురక్షితమేనా?
స్మార్ట్ ఫోన్ రంగంలో ఒకప్పుడు ఎదురులేని రారాజుగా వెలిగింది శాంసంగ్. ఆండ్రాయిడ్ శకం తొలినాళ్లలో శాంసంగ్ ఒక వెలుగు వెలిగింది. ఆ తరవాత ఒప్పొ, వివో లాంటి ఫోన్లు రావటం, తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే మరికొన్ని కంపెనీలు కూడా పోటీగా నిలవటంతో కాస్త వెనకబడింది.
కానీ, ఇప్పటికీ శాంసంగ్ ఫోన్ యూజర్లు ఎక్కువగానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి ఎదురు దెబ్బ తగిలింది.
శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన సోర్స్ కోడ్‌ను, కంపెనీ అంతర్గత విషయాలను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్ మార్చి 8 న ధృవీకరించింది. గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన సోర్స్ కోడ్‌ను ‘Lapsus$’ అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు ప్రముఖ టెక్ బ్లాగ్ బ్లీపింగ్ కంప్యూటర్ వెల్లడించింది.
దాదాపుగా 190GBల సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించడంతో బాటు. సోర్స్ కోడ్‌తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు దొంగిలించారు. దీనివల్ల శాంసంగ్ గెలాక్సీ యూజర్ల పర్సనల్ డాటా, ఫోన్లలో ఉన్న ఇతర వివరాలూ బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇదే హ్యకర్ల టీమ్ ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది.
అయితే శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది. దొంగిలించబడ్డ డేటాలో గెలాక్సీ యూజర్ల, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్ వెల్లడించింది.
ఈ ఘటన వల్ల కంపెనీ వ్యాపారంలో గానీ, కస్టమర్ల వ్యక్తిగత సమాచార భద్రతపైన గానీపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది.