సామాన్యుడికి దూరమవుతున్న… ఇరానీ చాయ్
’హైద్రబాద్ స్పెషల్ ఏంటీ?’ అని ఎవరైనా అడిగితే. హైద్రబాద్ బయట ఉండే ఎవరైనా ’’బిర్యానీ…‘‘ అనేస్తారు. కానీ, అంతకన్నా స్పెషల్ ఇంకొకటి ఉంది. ఇరానీ చాయ్! నిజమైన హైదరాబాదీ బిర్యానీ లేకుండా అయినా ఉంటాడేమో గానీ, ఇరానీ చాయ్ సిప్ పడకుండా ఉండలేడు.

హైదరాబాద్ కే సొంతమైన ఇరానీ కేఫ్ వాతావరణం కూడా అద్బుతంగా ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ ఇరానీ చాయ్ కూడా సామాన్యుడికి కాస్త దూరం జరిగింది. పదేళ్ల కాలంలో అయిదు రూపాయల నుంచి పది రూపాయలకు చేరుకున్న ఇరానీ చాయ్, ఇప్పుడు ఏకంగా ఒకే సారి 20 రూపాయలకు చేరుకుంది. కరోనాకు ముందు ఒక కప్పు ఇరానీ చాయ్ ధర రూ.10 ఉండేది ఇప్పుడు ఏకంగా..రూ.20కు చేరింది.
ఇరానీ టీ పొడి ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. పాలు లీటరుకు రూ.100కు చేరింది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,800కు చేరుకునే అవకాశం ఉంది. హోటళ్లలో ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఇరానీ ఛాయ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
పాలు, టీ పౌడర్, చక్కెర రేట్లు పెరిగిన కారణంగానే ఇరానీ చాయ్ ధరలు పెంచినట్లు స్పష్టం చేశారు. వీటితో పాటు కమర్షియల్ కూకింగ్ గ్యాస్ ధరలు కూడా పెరగడం మరింత ఆందోళన కలిగిస్తుందన్నారు. పెట్రోల్ రేట్లు పెరగటం వల్ల ట్రన్స్పోర్టేషన్ భారమై పశువుల దాణా రేట్లు కూడా పెరగటంతో, డెయిరీ కంపెనీలు లీటర్ పాలపై రూ.2 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.

ఈ పరిస్థితుల మధ్య ఇరానీ చాయ్ ధర పెంచక తప్పలేదని కేఫ్స్ నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. భారీ నష్టాల నేపథ్యంలో ధరల పెంపు అనివార్యమైందని హోటల్ యాజమానులు తెలిపారు.
మారుతున్న వాతావరణ పరిస్ధితులు - UNPUBLISH.IN
April 6, 2022 @ 9:25 am
[…] సామాన్యుడికి దూరమవుతున్న… ఇరానీ చా… […]