రాధే శ్యామ్‌ని ఇలా వాడేశారా సజ్జనార్ సాబ్ !
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ఎమ్‌డీగా సజ్జనార్ నియమితులైనప్పటి నుంచి సంస్థను గాడిన పెట్టేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బస్సులపై ప్రకటనలు తొలగించాలని, పెళ్లి వేడుకలకు బస్సు చార్జీల్లో రాయితీలతో పాటు, వివాహ జంటకు బహుమతులివ్వడం లాంటి నిర్ణయాలతో ప్రజలను ఆర్టీసీకి దగ్గర చేసి లాభాల బాట పట్టించేందుకు కృషి చేస్తున్నారు.
ఇటీవల ఆయన చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల ట్శృట్ఛ్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇంకా ఆర్టీసికి కూడా లాభాలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిరాశలో కొట్టుమిట్టాడుతున్న సంస్థ ఉద్యోగుల్లో కొత్త ఉత్తేజం కనిపిస్తోంది.
ఆర్టీసీ ప్రయాణాన్ని ప్రేమోట్ చేయటంలోనూ కొత్త పద్ధలను ట్రెండ్ ని ఫాలో అవుతూ వస్తున్నారు. ఆ మధ్య కుటుంబ సభ్యులతో కలిసి బస్ లో రీల్ వీడియో చేశారు. ఇప్పుడు మీమ్స్ కూడా చేస్తున్నారు.
ఆర్టీసీని ప్రయాణికులకు చేరువ చేసే క్రమంలో ఏ చిన్న అవకాశం దొరికినా సజ్జనార్ వదలడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ పెద్ద ఎత్తు ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పలు రకాల మీమ్స్‌ను క్రియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ మీమ్స్ పద్ధతిని ట్రాఫిక్ పోలీసులు చాలా కాలంగానే వాడుతున్నారు. ఇది జనాల్లో మంచి ఫాలోయింగ్ ని తీసుకొస్తూందటంతో అదే ఫార్ములా ఇప్పుడు ఆర్టీసీలో కూడా అప్లై చేసిన సజ్జనార్ కొత్త సినిమా రాధే శ్యామ్ పోస్టర్స్‌తో మీమ్స్ తయారు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు
ఇదివరకు సంక్రాంతి సీజన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మూవీ నుంచి మహేష్ బాబు ఫొటోలతో కూడా మీమ్ప్ పోస్ట్ చేశారు. ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న ప్రభాస్‌ని కూడా ఇలా వాడేశారు. ఇలా ట్రండీగా ఆలోచించే అధికారులు ప్రభుత్వ సంస్థల్లో ఉంటే ఆ తీరే వేరు.