యుద్ద భూమిలోనే ఉక్రెయిన్ సైనిక జంట వివాహం
యుద్ద భూమిలోనే ప్రేమ పరిమళించింది. రష్యా ఉక్రెయిన్ మధ్య ఒక పక్క అగ్ని వర్షం కురుస్తున్నా లెక్క చేయని ఆ ఇద్దరు సైనికులూ అక్కడే పెళ్ళి చేసుకున్నారు.
ఒక వైపు రష్యాతో యుద్ధం జరుగుతూండగానే ఉక్రేనియన్ 112 బ్రిగేడ్కు చెందిన సైనికులు లెస్యా, వాలెరీలు వివాహం చేసుకున్నారు. రష్యా యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపిస్తున్న చోటే, పెళ్ళి బట్టలు లేకుండానే సైనిక దుస్తులతోనే ఒక్కటైందీ జంట. తోటి సైనికులే సంగీత వాయిద్యాలతో, ఆయుధాలతో చుట్టూ నిలబడి ఈ పెళ్ళి జరిపించారు.
ఉక్రెనియా సైన్యంలో పనిచేస్తున్న లెస్యా, వాలెరీలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏ క్షనంలో అయినా వీరి ప్రాణాలే పోవచ్చు. అందుకే ఇప్పుడే పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. యుద్దం మధ్యలో దొరికిన చిన్న విరామంలో అక్కడే పెళ్లి చేసుకున్నారు. బందువులు, మిత్రులూ అందరూ తోటి సైనికులే అయ్యారు.

అందుకే… ఒక పక్క యుద్దం జరుగుతూండగానే ఆ బాంబుల మోతలమధ్యే చిన్న విరామంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఉంగరాలకు బదులుగా వాళ్ల హెల్మెట్లు మార్చుకున్నారు. ఒకవైపు వివాహం సాగుతుండగా, మరో వైపు రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.
పోయిన వారం కూడా ఇలాంటి వివాహమే జరిగింది. ఉక్రేనియన్ సైన్యంలోనే పని చేస్తిఉన్న మరో జంట క్లెవెట్స్, నటాలియా వ్లాడిస్లేవ్ ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలోని బాంబు షెల్టర్లో వివాహం చేసుకున్నారు. యుద్ద భూమిలోనే ఇలా వివాహాలు చేసుకుంటున్న ఈ జంట వీడియో వైరల్ అయ్యింది.