’జోన్ ఆఫ్ సైలెన్స్‘ ఆ నిశ్శబ్దం వెనుక ఏముంది?
ఈ ప్రపంచం ఇంకా మనిషికి చేతికి చిక్కలేదు. ఎన్నో అన్సాల్వ్డ్ మిస్టరీస్ మన చుట్టే ఉన్నాయి. దానికి కారణం అందనంత వరకూ అదొక విచిత్రమే. చిలీ అటకామా ఏడారి నుంచీ ఫసిఫిక్ సముద్రపు లోతులదాకా. భూమి మీది మూల మూలనా అంతు పట్టని మిస్టరీస్ చాలానే ఉన్నాయి. మనకు రోజుకో కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అయినా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడటం లేదు. విశ్వంలో దాగున్న ఎన్నో విశేషాలను తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు ఉవ్విళ్లూరుతూనే ఉన్నాడు. ఈ ప్రయత్నంలో కొన్నింటిని తెలుసుకుంటున్నా.. కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగా మిగులుతున్నాయి. అలాంటి అన్ సాల్వ్డ్ మిస్టరీనే ‘జోన్ ఆఫ్ సైలెన్స్”…
ప్రాణాలతో ఆటలాడినట్టే
సౌత్ మెక్సికోలో ఉన్న చివావావాన్ ఎడారి మధ్యలో ఎల్ పాసో కి పడమర వైపు 400 వందల మైళ్ళ దూరంలో ఈ ప్రదేశం ఉంది. ఇక్కడకి ప్రతీ సంవత్సరం ఎంతోమంది సైంటిస్టులూ, సైన్స్ స్టూడెంట్స్ వెల్తూ ఉంటారు. అతి తక్కువమంది టూరిస్టులు కూడా అక్కడకి వెళ్తారు. అయితే అదేమీ పిక్నిక్ స్పాట్ కాదు, పోనీ నేచర్ ఏమైనా అందంగా ఉంటుందా అంటే అదీ లేదు. అది ఒక మామూలు ఎడారి ప్రాంతం. ఈ ప్లేస్ కి 25 మైళ్ల దూరంలో సెబల్లోస్ అనే రాగ్ టాగ్ కంయూనిటీ ప్రజలు కొద్ది మంది మాత్రమే అక్కడ బతుకుతున్నారు. ఈ తెగ ఉండే ప్రదేశాన్ని దాటి సైలెన్స్ జోన్ లోకి అడుగు పెట్టటం అంటే ప్రాణాలతో ఆటలాడినట్టే. అయినా సరే అంతమంది అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? వెళ్లిన వాళ్లంతా అక్కడ దేని కోసం వెతుకుతున్నారు? ఆ జోన్ ఆఫ్ సైలెన్స్ లో ఏముందీ??
ఈ ప్రదేశం టూరిస్ట్ స్పాట్ కాదు, అక్కడ హొటల్స్, బీచ్ రిసార్ట్స్ లాంటివి ఏమీ లేవు, వింతగా కనిపించే కొన్ని కీటకాలు, ఎడారి పాములూ, బల్లులు మాత్రమే అక్కడ ఎక్కువగా కనిపించే జీవులు. కానీ ఇక్కడ కంటికి కనిపించని ఓ శక్తి ఏదో ఉంది. ఆ ప్రదేశానికి వెళ్లగానే సెల్ఫోన్ సిగ్నల్స్ కూడా కట్ అయిపోతాయి. టెలివిజన్, రేడియో, షార్ట్ వేవ్, మైక్రోవేవ్, శాటిలైట్ సిగ్నల్స్ ఏవీ ఇక్కడ పని చెయ్యవు. ఆ ప్లేస్ అంతా ఒక డార్క్ జోన్ లాంటిది. అందుకే ఈ ప్రదేశాన్ని డార్క్ జోన్ అని పిలుస్తారు. అట్లాంతికి సముద్రం లో ఉన్న బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదే ఈ ప్లేస్ కూడా.

బయోస్పియర్
1970లో న్యూ మెక్సికోలోని వైట్ సాండ్స్ మిస్సైల్ బేస్ నుంచి లాంచ్ అయిన ఒక మిస్సైల్ ఈ ప్రదేశానికి రాగానే ఫెయిల్ అయ్యి అక్కడే కూలిపోయింది. దాన్ని వెతకటానికి మెక్సికన్ గవర్నమెంట్ పర్మిషన్ తో యు.ఎస్. ఎయిర్ ఫోర్స్ సైంటిస్టుల టీం అక్కడికి వెళ్ళింది. ఆ ప్రదేశానికి వెళ్లగా ఎక్విప్మెంట్స్ ఏవీ పని చేయలేదు. బయటినుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. అసలు అక్కడికి రాగానే మిస్సైల్ సిగ్నల్స్ కూడా కట్ అయిపోయి ఆ తర్వాతే అది క్రాష్ అయ్యింది. కానీ అలా ఎందుకు జరుగుతోందో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అప్పటి నుండి మెక్సికన్ ప్రభుత్వం ఆ “జోన్” అనే ఒక రీసెర్చ్ కాంప్లెక్స్ నిర్మించింది. అక్కడి సైంటిస్టులు మాత్రం ఈ జోన్ ని బయోస్పియర్ అని పిలుస్తారు.
బెర్ముడా ట్రయాంగిల్ లాంటిదే
ఇక్కడ జరిగే రీసెర్చ్ మాత్రం ఎక్కువగా ఆ ప్రదేశంలో బతికే జీవులమీదనే జరుగుతుంది. కానీ అక్కడ ఇంకా ఏవో రహస్యంగా రీసెర్చిలు జరుగుతున్నాయని చెబుతుంటారు. ఆ ప్లేస్లో సాధారణ స్థాయికంటే ఎక్కువగా మాగ్నెటైట్ ఉన్నట్టు గుర్తించారు. అంతే కాదు అక్కడ భూమిలో ఉన్న అబ్ నార్మల్ అయస్కాంత శక్తివల్ల ఎక్కువగా ఉల్కాపాతాలు కూడా అక్కడే జరుగుతున్నాయని గుర్తించారు. అయితే ఆ అయస్కాంత శక్తి సహజంగానే ఉందా లేదంటే ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డదా అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అంటే ఒకసారి అక్కడ పెద్ద ఉల్క ఏదైనా పడి ఉంటే ఆ తర్వాత దే కొద్దికొద్దిగా ఉల్కాపాతాన్ని తన వైపు ఆకర్శించి అక్కడే పేరుకుపోతూ ఆ భూమిలో అయస్కాంత శక్తిని పెంచి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ జోన్ భౌగోళికంగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్కు ఉత్తరంగా ఉందని, సౌత్ లో బెర్ముడా ట్రయాంగిల్ కూడా అదే యాక్సీస్ మీద ఉందని ఆ రెండిటీ మధ్యా ఏదో సంబంధం ఉందన్నది కూడా ఒక వాదన ఉంది. ఏదేమైనా మొత్తానికి అక్కడ ఆకర్శణ శక్తి చాలా ఎక్కువగా ఉండటం వల్లనే ఆ ప్లేస్ లో ఏ రేడియో వేవ్స్ పనిచేయటం లేదన్నది మాత్రం అర్థం అయ్యింది.

ఇప్పటికీ రహస్యమే…
అయితే చాలామంది అనుమానం ప్రకారం మాత్రం అక్కడ అమెరికా, మెక్సికన్ ప్రభుత్వాలు అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్నాయని, అందుకే ఆ ప్లేస్ గురించి కావాలనే ప్రచారం చేస్తున్నారనీ అంటారు. ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న సెబల్లోస్ లొ ఉండే రాగ్ టాగ్ తెగ ప్రజల్లో కొందరు. తాము ఆ ప్రదేశంలో అప్పుడప్పుడూ గాలిలో మంటలు రావటం చూశామనీ చెప్పారు. అంతే కాదు రాత్రిపూట గాలిలో పెద్దేత్తున వెలుగుతున్న లైట్లతో కొన్ని వస్తువులు ఎగురుతూండటం చూసామని, అవి గ్రహాంతర వాసుల వెహికిల్స్ (ఫ్లయింగ్ సాసర్స్) అయి ఉండవచ్చనీ చాలా మందే చెప్పారు. కానీ జోన్ లో ఉండే సైంటిస్టులు చెప్తున్న దాని ప్రకారం అవి రీఅసెర్చ్ కోసం ఎగిరే డ్రోన్స్ మాత్రమ్నే అనీ, గ్రహాంతర వాసుల వాహనాలు కాదనీ చెప్పారు. అయితే ఇప్పటికీ ఈ విషయంలో అనుమానాలు మాత్రం పోలేదు.

వింత ఆకారాల మనుషులు
అక్కడ వింత ఆకారాలతో కొందరు మనుషులు తిరుగుతూంటారట. కేవలం వాళ్ళు మంచినీళ్ళు దొరుకుతాయా అని అక్కడ రాంచర్లని (పశువుల కాపరులు) అడిగేవాళ్లని ఓ రాంచర్ ఫ్యామిలీ చెప్పిందని కూడా కథనాలు వచ్చాయి. అంతే కాదు జోన్ లో పనిచేసే ఓ సైంటిస్ట్ కూడా తను ఆ ఎడారిలో తప్పిపోయినప్పుడు తనకు వింతగా కనిపించే ముగ్గురు వ్యక్తులు హెల్ప్ చేసారనీ, జోన్ సెంటర్ కి దారి చూపించారనీ… తను వాళ్లని మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే “పైనుంచి” వచ్చాము అని స్పష్టంగా ఇంగ్లిష్ లో మాట్లాడలేకపోయారనీ చెప్పాడు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినా ఎక్కువమంది మాత్రం ఈ కథలని నమ్మటం లేదు. కానీ మొత్తం మీద అక్కడ ఏదో జరుగుతోందని మాత్రం చాలామంది లో ఉన్న అనుమానం. ఎందుకంటే ఆ జోన్ ఆఫ్ సైలెన్స్ గురించి ఊహా గానాలే తప్ప అధికారికంగా ఏ న్యూస్ మనకు కనిపించదు. ‘జోన్” రీసెర్చ్ సెంటర్ గురించి కూడా కచ్చితమైన ఇన్ ఫర్మేషన్ ఏదీ మనకు దొరకదు. మొత్తంగా ఈ జోన్, బెర్ముడా ట్రయాంగిల్ లాగానే ఓ మిస్టరీగానే మిగిలి పోయింది….