గుజరాత్ పశు నియంత్రణ బిల్లు: వ్యతిరేకత ఎందుకు?
ప్రపంచంలో ఎక్కడా లేనివి మనదేశంలో చాలా ఉన్నట్టే రోడ్లమీద పశువులు ఉండటం కూడా మామూలే. సిటీల్లో ఇలా రోడ్లమీద తిరిగే పశువుల్లో ఎక్కువ భాగం ఆవులు, ఎద్దులు, గేదెలే ఉంటాయి. రోడ్డుకు అడ్డంగా పడుకుని హాయిగా నెమరు వేసుకుంటున్నా వాటిని కదిలించే ధైర్యం ఎవ్వరికీ ఉండదు.

అసలే నగరాల్లో ట్రాఫిక్ జనాలతో కిక్కిరిసిపోతోంది. అలాంటి సమయంలో ఇలా రోడ్లమీదికి వచ్చే పశువులవల్ల మరింత కష్టంగా మారుతోంది పరిస్థితి. వాటివల్ల జరిగే ప్రమాదాలూ తక్కువేమీకాదు. అయినా వీటిమీద ఇప్పటివరకూ కచ్చితమైన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వాలు విఫలమౌతూనే ఉన్నాయి.

అయితే..! ఇకనైనా రోడ్లమీద పశువుల సంచారాన్ని నియంత్రించాలని గుజరాత్ ప్రణుత్వం ఓ అడుగు ముందుకు వేసింది. పట్టణ ప్రాంతాల్లో సంచరించే పశువుల నియంత్రణ బిల్లును గుజరాత్ శాసనసభ ‘పట్టణ ప్రాంతాలలో పశు నియంత్రణ బిల్లు -2022’ ను ఆమోదించింది. ఈ కొత్త చట్టాన్ని అనుసరిస్తూ చేసిన నిబంధనల ప్రకారం పశువుల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పింది. చట్టంలో అంశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి అని ప్రభుత్వం వెల్లడించింది . కొత్త చట్టంలోని నిబంధనలు అహ్మదాబాద్, రాజ్‌కోట్, వడోదర, సూరత్, గాంధీనగర్, జునాగఢ్, జామ్‌నగర్, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 156 మునిసిపాలిటీల పరిధిలో వర్తిస్తాయి.
కొత్త బిల్లులో అంశాలేమిటి?
కొత్త బిల్లు ప్రకారం ఇప్పుడు పశువుల యజమానులు పశువులను పెంచుకోవడానికి లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ లేకుండా పశువులను పెంచుకోవటం కుదరదు.
ట్యాగ్ లేని పశువులను జప్తు చేసి, రూ.50,000 జరిమానా విధిస్తారు. అది చెల్లించిన తరువాతే వాటిని విడుదల చేస్తారు.
పశువులు రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా సంచరించకుండా చూడాల్సిన బాధ్యత యజమానిదే.
పశువులకు ట్యాగ్ తగిలించని యజమానులకు జైలు శిక్ష లేదా రూ. 10,000 జరిమానా విధిస్తరు.
పశువులు మొదటిసారి పట్టుబడితే యజమానికి రూ. 5000 జరిమానా.
రెండోసారి పట్టుబడితే రూ. 10,000,
మూడోసారి రూ. 15,000 జరిమానా విధిస్తారు.
మూడోసారి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు.
జప్తు చేసే అధికారులను అడ్డుకున్నా, వారి మీద దాడి చేసినా శిక్షార్హులవుతారు.

పశువులు చనిపోయినప్పుడు లైసెన్స్ పొందిన వ్యక్తి కళేబరాన్ని పర్యావరణానికి హాని కలిగించని విధంగా, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దాన్ని ఖననం చేయాలి.
ప్రతిపాదిత చట్టంలోని నిబంధనల ప్రకారం ఇన్స్పెక్టర్ లేదా అప్పీలేట్ అథారిటీ ఎప్పుడైనా పశుపెంపక కేంద్రాల మీద తనిఖీలు చేయవచ్చు.
అంటువ్యాధులు వ్యాప్తి అవకాశం ఉన్నప్పుడు లైసెన్స్ పొందిన డైరీలో ఉన్న పశువులన్నింటిని తొలగించమని ఆదేశించే అధికారం ఇన్స్పెక్టర్ కు ఉంటుంది.
పట్టణ ప్రాంతాల్లో తాము పెంచుకుంటున్న జంతువులకు రిజిస్ట్రేషన్,ట్యాగింగ్ తప్పనిసరి చేయాలి. వాటిని రోడ్లపై విచ్చలవిడిగా వదిలేసే యజమానులపై చర్యలు తీసుకుంటారు.
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన 90 రోజులలోపు కాపరులు లైసెన్స్ తీసుకోవాలి.
తమదగ్గర ఉన్న అన్ని పశువులకు లైసెన్స్ పొందిన 15 రోజులలోపు ట్యాగ్ చేయాలి. కొత్తగా పుట్టే పశువుల రిజిస్ట్రేషన్ కూడా రాబోయే రోజులలో చేయిస్తూ ఉండాలి.
ఇక రోడ్లమీద నిర్దిష్ట పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో పశువుల రాకపోకలను నియంత్రించాలనే నిబంధన తోపాటు. నగరపాలక సంస్థలకు కూడా పట్తణంలోని ఏ ప్రాంతాన్నైనా పశువుల పెంపకం చేపట్తని నిషేధిత జోన్ గా ప్రకటించే అధికారం ఉంది.
ఈ చట్టంలోని ఏ నిబంధనను అతిక్రమించినా పశువుల యజమానులకు ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.
వ్యతిరేకత ఎందుకు?
అయితే, ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామంటూ కాంగ్రేస్ ప్రకటించింది. దీనికి మద్దతుఇగా మరికొంతమంది బీజేపీ ఎమ్మెలేలు కూడా కలిసి వచ్చారు.
సూరత్, రాజ్‌కోట్, అహ్మదాబాద్ లతో పాటు మరికొన్ని చోట్ల ఈ బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్లు వేశారు.

అహ్మదాబాద్‌లోని బాపునగర్‌లోని ‘మల్ధార్ ఏక్తా సమితి’ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇన్ని నిబంధనలు విధిస్తే తామెలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ మొత్తం మీద 70 లక్షల మంది మాల్ధారీలు ఉన్నారు. వారిలో 70 శాతం పేదవారు, చదువుకోనివాళ్లే ఉన్నారు. వాళ్ళ పకు పశుప్[ఆలన తప్ప వేరే విషయాలు తెలియవు ఈ కొత్త బిల్లు వాళ్ళ మీద పిడుగు పాటూ లాంటిది అని కాంగ్రేస్ వాదిస్తోంది. (మాల్ధారీ అంటే పశుపోషకులు అని అర్థం.)
భిల్లును వ్యతిరేకించటానికి కారణం ప్రాక్టికల్ సమస్యలని పరిగణలోకి తీసుకోకుండా ఉన్నపాటున బిల్లుని ఆమోదించటమేననీ. తాము ట్రాఫిక్, రోడ్లమీద పశువులవల్ల వచ్చేసమస్యల పరిష్కారానికి సుముకంగానే ఉన్నామనీ చెబుతోంది కాంగ్రేస్.