బీజేపీకి ఆ దమ్ముందా? కేజ్రివాల్ ఆగ్రహం
మొత్తం ప్రపంచంలోనే మాదే పెద్ద పార్టీ అని చెప్పుకునే పార్టీ (బీజేపీ), ఆమ్ ఆద్మీ పార్టీకి భయపడుతోంది. అంటూ విమర్శించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ మున్సిపల్ పోల్స్ షెడ్యూల్ వాయిదాకు సంబంధించి మాట్లాడుతూ కేజ్రివాల్ ఈ వ్యాక్యలు చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ బయట మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, ఢిల్లీలోని నార్త్, ఈస్ట్, సౌత్ మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ కేంద్ర మంత్రి వర్గం ఒక బిల్లును మంగళవారం ఆమోదించదం పై తీవ్ర అసంతృపితి వ్యక్త పరిచారు కేజ్రివాల్.
సౌత్ ఢిల్లీ, నార్త్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లు ప్రస్తుతం బీజేపీ అధీనంలో ఉన్నాయి. వీటి ఎన్నికల షెడ్యూల్ను ఈసీ ప్రకటించేందుకు సిద్ధం కాగా, దీనికి కొద్ది సేపటికి ముందే బీజేపీ ఆ మూడు మున్సిపాలిటీలను ఏకం చేసే ఆలోచన ఉన్నట్టు ఈసీకి తెలిపిందని, దాంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వాయిదా పడిందని కేజ్రీవాల్ ఇటీవల విమర్శలు గుప్పించారు.
ఇన్నేళ్లూ కాలయాపన చేసి ఈసీ షెడ్యూల్ ప్రకటించే సమయానికి విలీనం ప్రస్తావన చేయడం ఏమిటని బీజేపీని ఆయన నిలదీశారు. షెడ్యూల్ ప్రకారం బీజేపీ ఎన్నికలు నిర్వహించి, గెలిస్తే తమ పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ చేశారు. బీజేపీకి ఆ దమ్ముందా? అని ఛాలెజ్ విసిరారు కేజ్రివాల్.