జర్మనీని భయపెడుతున్న Z : ఆనాటి విషాదం వెంటడుతోందా?
ప్లాన్ Z’ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రపంచ గమనాన్నే మార్చేసిన రెండో ప్రపంచ యుద్ద కారకుడు అని చెప్పుయ్కునే అడాల్ఫ్ హిట్లర్ ఈ ప్లాన్ Z (plan-Z)ని కీలకమైన ముందడుగు అనుకున్నాడు. జర్మనీని ప్రపంచపు బలమైన శక్తిగా నిలబెట్టాలనే ఆలోచనతో ముందుకు సాగాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు. జర్మనీ మీద బలమైన దెబ్బ పడింది. ఒకవేళ ఆ ప్లాన్ గనక అమలు అయిఉంటే ఇప్పటి ప్రపంచ చరిత్రే వేరుగా ఉండేది. ఇప్పుడు అగ్ర రాజ్యాలుగా పిలవబడుతున్న ఏ దేశమూ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండేది కాదు. ఇంతకీ ఏమిటీ ‘ప్లాన్ Z’, అందులో ఏం ఉన్నాయి?

జనవరి 27 1939 రెండోవ ప్రపంచం యుద్ధం ప్రారంభానికి కొద్ది నెలల ముందు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ బ్రిటిష్ నేవీని దెబ్బ కొట్టగల నేవీ జర్మనీ దగ్గర కూడా ఉండాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్లాన్ Z పేరుతో ఒక ఫైల్ పైన సంతకం చేసాడు.
ఈ ప్లాన్ ప్రకారం
- 10 యుద్ద నౌకలు
- 4 విమాన వాహక నౌకలు
- 10 యుద్ధనౌకలు
- 4 విమాన వాహక నౌకలు
- 3 యుద్ధ క్రూయిజర్లు
- 3 భారీ యుద్ద నౌకలు (పాతవి)
- 12 భారీ యుద్దనౌకలు (కొత్తవి)
- 5 భారీ క్రూయిజర్లు
- 36 క్లాస్-M లైట్ క్రూయిజర్లు
- 24 స్కౌట్ క్రూయిజర్-రకం లైట్ క్రూయిజర్లు
- 68 డిస్ట్రాయర్లు
- 90 టార్పెడో బోట్స్
- 249 U-బోట్స్..
తయారు చెయ్యాలని హిట్లర్ భావించాడు.

కానీ, అనుకున్న వాటిలో పావువంతు కూడా తయారు చేయలేకపోయాడు, నిజానికి అవి కూడా హిట్లర్ చేతిలో ఉండి ఉంటే రెండో ప్రపంచ యుద్ధం మరోలా ఉండేదేమో..! అదంతా గడిచిపోయిన కథ. రెండో ప్రపంచ యుద్దాన్ని చూసిన తరం కూడా ఇప్పుడు చివరిదశలో ఉంది. ఆనాటి మనుషులు మహా అయితే ఒకరో ఇద్దరో బతికి ఉండవచ్చు. ఇప్పుడు మనం మూడో ప్రపంచ యుద్దం గురించి మాట్లాడుకునే సమయంలో మళ్ళీ ఈ ప్లాన్ Z గురించి ఎందుకు గుర్తొచ్చిందీ అంటే…
ఇన్ని సంవత్సరాల తరువాత ఉక్రేయిన్, రష్యా సంక్షోభ నేపథ్యంలో మళ్లీ ఈ Z అనే అక్షరం వార్తల్లోకి వచ్చింది. ఆనాడు ఏ అక్షరం చూపించి హిట్లర్ ప్రపంచాన్ని భయపెట్టాలి అనుకున్నాడో, ఈ రోజు అదే అక్షరం చూసి జర్మనీ భయపడుతుంది. ఇదే ఐరనీ ఆఫ్ జర్మనీ అనుకోవచ్చేమో…

నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) విస్తరణతో మొదలైన గొడవ ఉక్రెయిన్ మెడకు చుట్టుకుంది, నాటోలో చేరము అంటూ ఇదివరలో ఉక్రెయిన్ పాలకులు ఇచ్చిన మాట, చేసిన అగ్రిమెంట్‌ని లెక్క చేయకుండా,ప్రస్తుత ప్రెసిడెంట్ జెలెన్స్కీ, ఉక్రెయిన్ కూడా నాటోలో చేరుతుంది అనడంతో వివాదం తీవ్రమయ్యింది. రష్యాకి నాటో పక్కలో బల్లెంలా మారే ఈ తరహా తీరుకి మండిపడ్డ రష్యా, ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో ప్రో-వార్ సింబల్ గా “Z” ని వాడుతోంది. యుద్ధ ట్యాంకులు, మిలటరీ వాహనాల పైన, యుద్ధ విమానాల పైన, ఉక్రెయిన్‌పై జరిగే యుద్ధంలో పాల్గొనే ప్రతీ వాహనంపైనా “Z” అనే అక్షరాన్ని వేస్తుంది. ఇక్కడి వరకూ వాళ్ల విషయమేలే అనుకోవచ్చు. కానీ, ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది.

ఇప్పుడు ఈ “Z” సింబల్ ని కొందరు జర్మనీ పౌరులు, వాళ్ళ ఇళ్ళ ముందు ముగ్గులాగా పెయింట్ చెయ్యటం, అంతకు మించి సోషల్ మీడియాలో ఎకౌంట్స్‌కి డిస్ప్లే పిక్చర్‌గా కూడా పెట్టుకుంటున్నారు. ఇది గమనించిన జర్మనీ ప్రభుత్వం ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తోంది. ‘‘దీన్ని యుద్ధం నేరంగా చూస్తాం’’ అంటూ కూడా ప్రకటనలు జారీ చేస్తోంది. ఏ అక్షరాన్ని ఆనాడు జర్మనీ కీలకంగా భావించిందో ఇప్పుడే అదే జర్మనీ ప్రభుత్వం ఆ అక్షరాన్ని నిషేదిత అంశంగా భావిస్తోంది. చరిత్ర తిరగబడటం అంటే ఇదేనేమో..



