పుతిన్ ఎవరు? అతని కల ఏమిటి?
ఉక్రెయిన్ యుద్దం మొదలు కాగానే ప్రపంచమంతా యుద్దానంతర పరిణామాలను అంచనా వేయటంలో తలమునకలుగా ఉంటే కామన్ మ్యాన్ మాత్రం ఏం సెర్చ్ చేస్తున్నాడో తెల్సా? రష్యా అధ్యక్షుడు పుతిన్ గురించి. అసలు అతను ఎవరు? ఎలా ఎదిగాడు అనే విషయాలమీద ఎక్కువ చర్చలు జరుగుతున్నాయట. రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. అధ్యక్షుడు కాకముందు నుంచే పుతిన్ కాస్త దుడుకుగా ఉండే మనిషిగా పేరు తెచ్చుకున్నాడు.

1952 అక్టోబర్ 7న లెనిన్గ్రాడ్.. అంటే ప్రస్తుత సెయింట్ పీటర్స్బర్ల్లో పుట్టిన పుతిన్… జూడోలో బ్లాక్ బెల్ట్ సాధించారు. “లా” పూర్తి కాగానే పుతిన్ రష్యన్ గూఢచార సంస్థ కేజీబీలో చేరాడు. తూర్పు జర్మనీలో సీక్రేట్ ఏజెంట్ గా కూడా పనిచేశాడు.
1988లో ల్యుడ్మిలాను పెళ్లి చేసుకున్నారు. (మూడేళ్ల కిందటే పుతిన్ ఆయన భార్య ల్యుడ్మిలాకు విడాకులిచ్చాడు) 1994లో రాజకీయాల్లో చేరి తాను పుట్టిన సిటీలో డిప్యూటీ మేయర్, మూడేళ్ల తర్వాత ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (Fశ్భ్) చీఫ్ అయ్యాడు. ఆ తర్వాత ఏకంగా రష్యా అధ్యక్ష పీఠం మీదకి ఎగబాకాడు. 1999 జనవరి ఒకటిన నాడు తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. 2000, 2004లో రెండు సార్లు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి. వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా పోటీ చేయకూడదని రష్యా రాజ్యాంగంలో ఉండటంతో ఒక దఫా గ్యాప్ తరవాత మళ్లీ 2008లో పుతిన్ తిరిగి ప్రధాని పదవి చేపట్టారు. 2012 నుంచి వరుసగా రెండు టర్మ్‌లు అధ్యక్షుడిగా గెలిచాడు. ఇప్పుడు ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
మార్షల్ ఆర్ట్స్ అంటే విపరీతమైన ఇష్టం ఉన్న పుతిన దాదాపు స్ట్రీట్ ఫైటర్ గా బతికాడట కొన్నాళ్ల పాటు. చదువు పూర్తి కాగనే రష్యన్ గూఢచార సంస్థలో చేరాడు. దానికన్నా ముందే కొన్నాళ్లు క్యాబ్ డ్రైవర్ గా కూడా పని చేశాడు. ఆ తరవాత డిప్యూటీ మేయర్‌గా రాజకీయ రంగప్రవేశం చేసి చివరకు అధ్యక్ష పదవిని అందుకున్నాడు. అదే పదవిలో ఇరవయ్యేళ్లుగా కొనసాగుతున్నాడు.
అమెరికా, నాటోల నుంచి ఎదురైన చేదు అనుభవాల తరవాత. ప్రపంచంలో రష్యా అధిపత్యాన్ని తిరిగి నిలబెట్టాలన్న కోరికతో ఉన్నాడు పుతిన్. మళ్ళీ ఆనాటి సోవియట్ యూనియన్ ని నిర్మించాలన్నదే పుతిన్ కల అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సోవియట్ యూనియన్ అంతాన్ని 20వ శతాబ్దపు అతి పెద్ద విపత్తుగా పుతిన్ ఇప్పటికే అభి వర్ణించారు. అధునిక రష్యా చరిత్రను మార్చే అవకాశం తనకొస్తే. సోవియట్ యూనియన్ను మళ్లీ తీసుకొస్తానని బహిరంగంగా చెప్పారు. రష్యన్ భాష మాట్లాడే పాత సరిహద్దులతో మళ్లీ ఓ సామ్రాజ్యం రావాలన్నది పుతిన్ కల. రెండో ప్రపంచయుద్ధంలో నాజీల ఓటమిని ఉదాహరణగా చూపించి పుతిన్ రష్యన్లలో దేశభక్తిని రెచ్చగొట్టారు. రష్యాను మళ్లీ ప్రపంచంలో అగ్రరాజ్యంగా రూపొందించాలన్నదే ఆయన ఏకైక ఎజెండా

బాలిస్టిక్ క్షిపణి నిరోధక ఒప్పందాన్ని రద్దు చేయాలన్న నాటి అమెరికా అధ్యక్షుడు జార్డ్ డబ్యు బుష్ ప్రతిపాదనను 2001లో పుతిన్ తీవ్రంగా వ్యతిరేకించాడు.ఇరాక్‌లో సద్దాం హుస్సేర్ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న అమెరికా, బ్రిటిష్ ప్రయత్నాలను వ్యతిరేకించాడు. అప్పౌడు పుతిన్ తో పాటు జర్మన్ ఛాన్స్లర్, ప్రాన్స్ అధ్యక్షుడు కూడా పుతిన్ కు మద్దతుగానే ఉన్నారు.

సోవియట్ యూనియన్ అంతాన్ని 20వ శతాబ్దపు అతి పెద్ద విపత్తుగా పుతిన్ ఇప్పటికే అభి వర్ణించారు. అధునిక రష్యా చరిత్రను మార్చే అవకాశం తనకొస్తే. సోవియట్ యూనియన్ను మళ్లీ తీసుకొస్తానని బహిరంగంగా చెప్పారు. రష్యన్ భాష మాట్లాడే పాత సరిహద్దులతో మళ్లీ ఓ సామ్రాజ్యం రావాలన్నది పుతిన్ కల. రెండో ప్రపంచయుద్ధంలో నాజీల ఓటమిని ఉదాహరణగా చూపించి పుతిన్ రష్యన్లలో దేశభక్తిని రెచ్చగొట్టారు. రష్యాను మళ్లీ ప్రపంచంలో అగ్రరాజ్యంగా రూపొందించాలన్నదే ఆయన ఏకైక ఎజెండా