ఢిల్లీకి కేసీఆర్ : రకరకాల చర్చలు నడుస్తున్నాయి…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన అనగానే రకరకాల ఊహాగానాలూ, అంచనాలూ ఈ మధ్య పెరిగాయి. ధాన్యం కొనుగులుపై ఇప్పటికే నిరసన తెలియచేస్తున్న కేసీఆర్ ఈ మధ్య “త్వరలోనే కేంద్రానితో తాడో పేడో తేల్చుకుంటామని” ప్రకటించటం వల్ల. ఈసారి డిల్లీ ప్రయాణం మీద మరింత ఆసక్తి పెరిగింది.
వరిధాన్యం అంశానికి సంబంధించి చర్చల కోసం కేసీఆర్ ఈ పర్యటనలో కేంద్ర మంత్రిని కలిసే అవకాశం ఉంది. వీలైతే ప్రధానమంత్రి మోదీని సైతం కలుస్తారని అనుకుంటున్నారు.
అంతే కాదు మరోవైపు బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలంతా సమావేశం కావాలని మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ అంశానికి సంబంధించిన మీటింగుళ్లో కూడా కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. అయితే ఇది కచ్చితమైన సమాచారం అని కూడా చెప్పలేం.
అయితే నిజానికి బుధవారం పదిగంటలకు సతీమణి శోభతో కలిసి ఢిల్లీకి బయలు దేరిన కేసీఆర్ తన అనారోగ్య సమస్యల విషయమై చికిత్సకోసమే అనేది అఫీషియల్ న్యూస్. కాగా, అక్కడ ఆయన పర్యటనలో ఏ ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారన్నది ఆసక్తిగా మారింది.