పదవ, ఎనిమిదవ తరగతి అర్హతతో: తూర్పు రైల్వే పోస్టులు
తూర్పు రైల్వే పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2972 ఖాళీలను భర్తీ చేయటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 10 వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్ rrcer.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం: 2972 పోస్ట్‌లు
హౌరా డివిజన్: 659 పోస్టులు,
ళిలూహ్ వర్క్‌షాప్: 612 పోస్ట్‌లు,
సీల్దా డివిజన్: 297 పోస్టులు,
కంచరపర వర్క్‌షాప్: 187 పోస్ట్‌లు,
మాల్డా డివిజన్: 138 పోస్టులు
అసన్సోల్ డివిజన్: 412 పోస్టులు
జమాల్పూర్ వర్క్‌షాప్: 667 పోస్ట్‌లు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి దానికి సమానమైన కోర్స్ పూర్తి చేసి ఉండాలి. అంటే.., ఇంటర్ విధానం కాకుండా ప్లస్ 2 విధానంలో అయినా పదవతరగతి సమాన పరీక్ష పూర్తి చేసి ఉండాలి.
కనీసం 50% మార్కులను కలిగి ఉండటమే కాకుండా, అభ్యర్థి NCVT/SCVT నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను కూడా కలిగి ఉండాలి. ఈ సర్టిఫికెట్ కూడా తప్పని సరి. 11.04.2022 నుంచీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేయటానికి చివరి తేదీ 10.05.2022.
గ్యాస్, ఎలక్ట్రిక్ వెల్డర్స్, వైర్‌మ్యాన్, షీట్ మెటల్ వర్కర్, లైన్మెన్, కార్పెంటర్, పెయింటర్ (జనరల్) పోస్టులకు గుర్తింపు పొందిన పాఠశాల నుండి 8వ తరగతి ఉత్తీర్ణత, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, NCVT/SCVT సర్టిఫికేట్ పొందినవారు అప్లై చేసుకోవచ్చు.
అభ్యర్థులు మెరిట్ ఆధారంగా ఎంపిక చేయబడతారు. 100 రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. SC,ST,PWBD, మహిళా అభ్యర్థులకు చెందిన అభ్యర్థులకు ఈ అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అధికారిక వెబ్సైట్ rrcer.com ద్వారా పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు.