ఆమె పుతిన్ గాళ్‌ఫ్రెండ్, తరిమేయండి: 50 వేలమందికి పైగా డిమాండ్
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో తన కుటుంబాన్ని సురక్షితంగా సైబీరియా ప్రాంతంలోని అట్లాయ్ పర్వతాల వద్ద నిర్మించిన అణుబంకర్లలో భద్రంగా దాచిపెట్టిన విషయం తెలిసిందే.
పుతిన్ ప్రియురాలుగా భావిస్తున్న అలీనా కబయేవా కూడా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో సెక్యూరిటీ మధ్య జీవిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుం అలినా వయసు 38 ఏళ్లు. ఆమె పుతిన్ గాళ్ ఫ్రెండ్ అని అందరూ అంటున్నా.. రష్యా అధ్యక్షుడు మాత్రం ఎప్పుడూ ఈ విషయాన్ని పబ్లిక్‌గా చెప్పలేదు.

మూడేళ్ల వయసులోనే రిథమిక్ జిమ్నాస్టిక్స్ సాధన ప్రారంభించిన కబయేవా. 15 ఏళ్ల వయసుకే ఐరోపా ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుని అత్యంత చిన్నవయసులో ఆ ఘనత సాధించిన తొలి రష్యన్గా నిలిచింది. ఆ తర్వాత జిమ్మాస్టిక్స్కు రిటైర్మెంట్ ప్రకటించి 2004లో రాజకీయాల్లోకి వచ్చి, 2005లో పబ్లిక్ ఛాంబర్ ఆఫ్ రష్యా సభ్యురాలిగా తర్వాత 2008లో పబ్లిక్ కౌన్సిల్ ఆఫ్ జాతీయ మీడియా గ్రూప్ ఛైర్మన్‌గా పని చేసింది.
2007, 2014లో దుమా రాష్ట్రం నుంచి యునైటెడ్ రష్యా పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచింది. ఈ సమయంలోనే అధ్యక్షుడు పుతిన్‌తో కబయేవాకు సాన్నిహిత్యం ఏర్పడిందన్న ప్రచారం ఉంది. తొలిసారిగా 2008లో పుతిన్-కబయేవా రిలేషన్షిప్ వార్తలు గుప్పమున్నాయి. పుతిన్, కబయేవాలకు నలుగురు పిల్లలు ఉన్నారు.

గత ఏడాది డిసెంబర్లో చివరిసారి జిమ్నాస్టిక్ టోర్నీలో ఆమె ప్రదర్శన ఇచ్చింది. ఉక్రెయిన్ వార్ మొదలవ్వగానే.. అలినా కబేవా స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఆరేళ్లు చేశారు.

స్విట్జర్లాండ్ నుంచి ఆమెను బహిష్కరించాలంటూ అంతర్జాతీయంగా పనిచేసే Change.orgలో మూడు దేశాలకు చెందిన కొందరు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రష్యా కూడా ఉండటం విశేషం. రష్యాతో పాటు ఉక్రెయిన్, బెలారస్‌కు చెందిన వారు ఉన్నారు. ఈ పిటిషన్‌ను సమర్థిస్తూ ఇప్పటి వరకు 50 వేల మంది సంతకాలు చేశారు.