తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. తర్వాత ఏం చేశారంటే..!
తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ (@jaitdp)పై సైబర్ దాడి జరిగింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత టీడీపీ అకౌంట్‌ను హ్యాక్ చేసిన నేరగాళ్లు కొన్ని అర్దంపర్దం లేని ట్వీట్లు చేశారు. విషయం తెలిసిన వెంటనే పార్టీ ఐటీ బృందం ఈ విషయాన్ని ట్విట్టర్ ఇండియాకు రిపోర్టు చేసింది. ప్రస్తుతం అకౌంట్ ఇంకా హ్యాకర్ల చేతిలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. అర్దరాత్రి హ్యాక్ చేసిన నేరగాళ్లు.. స్పేస్ఎక్స్ ట్వీట్‌కు వరుసగా రిప్లైలు కొట్టారు.
కాగా పార్టీ అధికారిక అకౌంట్ హ్యాక్ అయినట్లు జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ‘కొంత మంది దుర్మార్గులు పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని వెంటనే ట్విట్టర్ ఇండియాకు రిపోర్టు చేశాము. త్వరలోనే అకౌంట్ రిస్టోర్ అవుతుంది’ అని ట్వీట్ చేశారు.
కాగా, ఇటీవల కాలంలో ఒక రాజకీయ పార్టీ అకౌంట్ హ్యాక్ అవడం ఇండియాలో ఇదే తొలిసారి. భారత్‌లోని రాజకీయ పార్టీల సోషల్ మీడియా ఖాతాలు, వెబ్సైట్లపై సాధారణంగా సైబర్ నేరగాళ్లు దాడులు జరపడం చాలా తక్కువ.