‘ది కశ్మీర్ ఫైల్స్’. ఇది కేవలం సినిమా కాదు
రిలీజ్ అయిన ప్రతిచోట హౌస్ ఫుల్ కలెక్షన్ తో నడుస్తూ ఈ సినిమా దేశం మొత్తం ట్రేండింగ్ లో ఉంది. 4 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా రోజురోజుకు పెరుగుతూ లాభం 200 కోట్లు దాటేలా ఉంది.

నిజాలు చూపించారు అంటూ సినిమాపై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపిస్తున్నారు, సినిమా చుసిన జనం భావోద్వేగాలకు లోనవుతున్నారు.
ఇదంతా నాణానికి ఒకవైపే అంటున్నారు చరిత్రకారులు. ఈ సినిమాలో చూపించినవి పూర్తిగా నిజం కావని, జనంలోని హిందూ సెంటిమెంట్ ని వాడుకుని సొమ్ము చేసుకోవడానికి ఈ సినిమా తీసారని బలంగా చెబుతున్నారు. లక్షల మంది కశ్మీరీ పండిట్ల మీద 1990లో జరిగిన హత్యాకాండగా చెబుతున్న ఈ సినిమా వాస్తవానికి దూరంగా ఉందని అంటున్నారు చరిత్రకారులు.

వాస్తవమా ? వక్రీకారణా?
వాస్తవమా? వక్రీకారణా?
1990లో కశ్మీర్ లో ఎంతమంది కశ్మీరీ పండిట్లు ఉన్నారు అనేది ఇప్పుడు చర్చగా మారింది.
kashmiri pandits population in 1990
why kashmiri pandits left kashmir in 1990
how many kashmiri pandits killed in 1990
లాంటి ప్రశ్నలతో నెటిజన్లు గూగుల్ సెర్చ్ చెయ్యడం క్రమంగా పెరుగుతుంది. సోషల్ మీడియా అంటా ఈ ప్రశ్నలే ఎక్కడ చూసినా ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా పైనే చర్చ.తెలుగు మీడియా సంస్థలు కుడా ఈ ఇప్పుడు ఈ చర్చలోకి దిగాయి.
