దిగివస్తున్న జెలెన్స్కీ: లొంగుబాటుకు అంగీకారంగా వ్యాఖ్యలు
రెండు దేశాల మధ్య ఏర్పడ్డ అనిశ్చితి ఒక కొలిక్కి వచ్చినట్టే కనబడుతోంది. అమెరికా మీద అతినమ్మకంతో తన దేశ ప్రజలను తానే అఘాతంలోకి నెట్టానన్న బాధ జెలెన్స్కీలో మొదలయినట్టే ఉంది. ఉక్రెయిన్ మీద రష్యా దాడులు మొదలై 13 రోజులైంది. రష్యా చేస్తున్న దాడులకు ఉక్రెయిన్ అతలాకుతలం అవుతోంది. వేలకొద్ది అమాయక పౌరులు మరణించారు. కోలుకోలోని స్థాయిలో ఆ చిన్న దేశం సర్వ నాశనానికి ముంగిట నిలబడింది. అంతర్జాతీయ సమాజం ప్రేక్షక పాత్ర వహించింది. ఐక్య రాజ్య సమితి చేతులెత్తేసింది. నమ్ముకున్న అమెరికా తమాషా చూస్తూ ఉండి పోయింది. చావో రేవో తేల్చుకుంటాం అన్న ధైర్యం అడుగంటింది. కళ్ళముందే దేశం కుప్పకూలిపోవటాన్ని, చిన్న పిల్లలతో సహా తమ దేశ పౌరులు అలమటించటాన్ని చూస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ఇప్పుడు లొంగిపోయే ఆలోచనకు వస్తున్నట్టున్నాడా?

ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వొలొదిమిర్ జెలెన్స్కీ రష్యాను సంతృప్తి పరిచే వ్యాఖ్యలు చేస్తూ యుద్దాన్ని ఆపాలన్న సూచన చేశారు. యుద్ధానికి కారణమైన ‘నాటో’లో చేరే ఆలోచనను విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. రష్యా చేసిన మరో కీలక డిమాండ్‌పైనా తాను మాట్లాడటానికి సిద్ధమని చెప్పారు.

ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో వొలోదిమిర్ చెప్పిన విషయమేమిటంటే…. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన దేశాల మధ్య చిచ్చుపెట్టిన నాటో ఐరోపాకూ రష్యాకూ మధ్య కోల్డ్ వార్ కు దారి తీసింది. రష్యా ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఉండాల్ని నాటోలో చేరాలని ప్రయత్నించాం. కానీ ఇప్పుడు మేము ఆ ఆలోచనని విరమించుకున్నాం. అని చెప్పారు.
అసలు రష్యా దాడులు మొదలైందే ఉక్రేయిన్ నాటో లో చేరటానికి వ్యతిరేకంగా. ఇప్పుడు స్వయంగా జెలెన్స్కీనే తాము నాటోలో చేరే ఆలోచన విరమించుకుంటున్నని అనటంతో మళ్లీ శాంతి నెలకొంటుందన్న ఆశలు చ్ఘిగురిస్తున్నాయి.
అసలు ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ దాడులు మొదలవటానికి రెండు రోజుల ముందు ఫిబ్రవరి 21న డోనెట్స్క్, లుగాన్స్క్ అనే ఉక్రెయిన్ లోని రాష్ట్రాలను స్వతంత్ర దేశాలుగా రష్యా గుర్తించింది. దాంతో ఉక్రెయిన్ ముందుగా -కయ్యానికి కాలు దువ్వింది. నాటో, అమెరికాలు తమకు మద్దతునిస్తాయని నమ్మిన జెలెన్స్కీ రష్యాతో యుద్దానికి సవాల్ విసిరాడు.

అయితే నిజంగా యుద్దం మొదలు కాగానే నమ్ముకున్న రెండు శక్తులూ పక్కకు తప్పుకున్నాయి. ఉక్రేయిన్ ను ఒంటరిగా వదిలేశాయి. ఫలితంగా బలిసి ఉన్న దున్న ముందు చిన్న గొర్రెపిల్లని నిలబెట్టినట్టుగా అయ్యింది ఉక్రెయిన్ పరిస్థితి. అప్పటికీ మొనండి ధైర్యంతో రష్యాని ఎదిరించటానికే పూనుకున్న ఉక్రేయిన్. నెమ్మది నెమ్మదిగా తాను అగ్ర దేశాల ఆటలో బలిపశువునయ్యానని గ్రహించింది. కానీ అప్పటికే ఆ దేశం స్మాశానంగా మారిపోయింది. ఈ ఘటనల నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ చేసిన ప్రకటన ఆశావహంగానే ఉంది. అయితే ఈ చర్చలని కూడా రష్యా తనకు అనుకూలంగా మార్చుకుంటుందనే విషయంలో అనుమానమే లేదు. అయితే.. పూర్తిస్థాయిలో ఉక్రెయిన్ను మిలటరీ రహిత దేశంగా ప్రకటించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. దానికి తోడు క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలని చెబుతోంది. ఈ రెండు డిమాండ్లకూ జెలెన్స్కీ అంగీకరిస్తాడా? క్రిమియాను వదులుకోవడమంటే అపారమైన సహజ వాయువులు, చమురు సంపదను రష్యా చేతుల్లో పెట్టడమే. ఈ నేపథ్యంలో రష్యా ఎలా స్పందిస్తుంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. “ఆ రెండు రాష్ట్రాలనూ స్వతంత్ర దేశాలుగా గుర్తించటానికి తాను సిద్దమేనని, కానీ ఆ విషయంలో చర్చలు జరగాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న ఉక్రెయిన్ మద్దతు దారుల పరిస్థితి గురించి కూడా ఆలోచించాలని” జెలెన్స్కీ అభిప్రాయ పడ్డాడు.
March 9, 2022 @ 10:52 am
Wonderful beginning