మెటావర్స్ అంటే ఏమిటి?

ఇప్పుడు ప్రపంచంలోనే క్రేజీ‌వర్డ్ ఏమిటో తెలుసా? మెటావర్స్. ఇప్పుడు తరచూ ఈ పదాన్ని వింటున్న మనం కొద్ది సంవత్సరాలలో ఆ ప్రపంచంతో అనుసంధానం కాబోతున్నాం. వాస్తవానికి ‘మెటావర్స్’ అనేది ఒక పారలల్ ప్రపంచం. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడున్న ఫేస్‌బుక్ కన్నా వందరెట్లు రియాలిటీగా కనిపించే కొత్త లోకం అది. ఇది వర్చువల్ ప్రపంచమే అయినా కొన్నాళ్లలో నిజమైన ప్రపంచాన్ని శాసించబోయేది ఇదే.