ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి? ఈ ఎన్నికల వల్ల లాభపడిన పార్టీ ఏంటి?

దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వెలువడిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి రానుండగా.. పంజాబ్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోనుండటం పెద్ద ఎదురు దెబ్బ.